Tollywood News | ఒకప్పుడు భారీతనంతో మూవీలను తెరకెక్కిస్తూ అంతకంటే భారీ హిట్లు కొట్టే డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది ఒక శంకర్ (Director Shankar)మాత్రమే. అంతలా అతడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించేవి. ఒక సినిమాకు మించి మరొక సినిమాతో బంపర్ హిట్టు కొడుతూ ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఒకప్పుడు టాప్ హీరోలంతా శంకర్ డైరెక్షన్లో మూవీని చేయాలని ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. గత కొంతకాలంగా శంకర్ తీసిన మూవీస్ ఏవి కూడా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపెట్టలేకపోతున్నాయి. ఒక సినిమాకు మించి మరొకటి భారీ డిజాస్టర్ లు అవుతున్నాయి.
రోబో (Robo) మూవీ తర్వాత వచ్చిన ఏ మూవీ కూడా తన స్టామినా కు తగ్గట్టు కలెక్షన్లను రాబట్ట లేకపోయాయి. లాస్ట్ గా వచ్చిన ఇండియన్ -2 (Indian-2), గేమ్ చెంజర్ (Game Changer)మూవీస్ తన కెరీర్ లోనే డిజాస్టర్ మూవీస్ గా నిలిచిపోయాయి. ఇండియన్ -2 మూవీ పరిస్థితి అయితే మరి దారుణం.శంకర్ బెస్ట్ మూవీలో కమల్ హాసన్ (Kamal Hassan) ఇండియన్ సినిమా గర్వించేదగ్గది. ఈ మూవీతో అందరూ శంకర్ బాక్సాఫీస్ కలెక్షన్ల సునామి సృష్టించడానికి బౌన్స్ బ్యాక్ అవుతాడని అందరూ భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియన్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది. ఈ మూవీ ని ఆడియన్స్ ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేకపోయారు.
శంకర్ పనైపోయిందా..?
ఇండియన్ మూవీ స్టోరీ ఎంత బలంగా ఉందో.. ఈ మూవీ స్టోరీ మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఏమాత్రం ఆకట్టుకొని స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కు విసుగు పుట్టించాడు. ఈ మూవీ తర్వాత భారీ అంచనాలతో రిలీజ్ అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా మెప్పించలేకపోయింది.కాస్తలో కాస్త ఇండియన్ -2 మూవీ కంటే గేమ్ చేంజర్ కొద్దిగా నయం అనిపించిందని ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మూవీ ని కూడా కొందరు డిజాస్టర్ కిందనే తేల్చేశారు. ఈ సినిమా తర్వాత శంకర్ పై ఆడియన్స్ కి పూర్తిగా నమ్మకం పోయింది.
Tollywood : ఇంకా 30% షూట్…
ఇక శంకర్ పనైపోయిందని ఆడియన్స్ ముద్ర వేశారు. ఔట్ డేటెడ్ డైరెక్టర్ అని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో శంకర్ మాత్రం ఇండియన్-3 పై ఫోకస్ పెడుతున్నాడు. ఇండియన్ -2 మూవీ తీసినప్పుడే ఇండియన్-3 ని కూడా దాదాపు 70% షూట్ కూడా చేశారు. ఇంకా 30% షూట్ బ్యాలెన్స్ ఉంది. దీనిపైన ఇప్పుడు శంకర్ ఆలోచిస్తున్నాడ. లైకా ప్రొడక్షన్స్ కొంత కాలంగా వారి మూవీస్ ఏమాత్రం ఆడక పోవడంతో పూర్తి నష్టాల్లో కూరుకుపోయారు. ఇక ఈ సినిమాను 30% ఎలాగైనా తెరకెక్కించాల్సిందే.లేకపోతే ఇంకా ఎక్కువ మొత్తంలో నష్టపోతారు. వారికి తలనొప్పి అనిపించిన నిర్మించక తప్పదు. ఈ మూవీ పైన ఎవరికీ నమ్మకం లేకపోయినా కొద్దిలో కొద్దిగా ఆడినా కానీ పెట్టిన దాంట్లో కొన్ని డబ్బులైనా వస్తాయని వారి ఆశ. ఈ మూవీ షూటింగ్ మొదలవ్వాలంటే కమల్ హాసన్ నెలరోజుల డేట్స్ కావాల్సి ఉందట. కమల్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాక మిగిలిన షూటింగ్ అతి తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఏదేమైనా శంకర్ ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీతోనైనా బౌన్స్ ప్యాక్ అయి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కి రుచి చూపించాలని కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.