Sarkar Live

Jack Trailer | జాక్ ట్రైలర్ వచ్చింది…

Jack Trailer | డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీలతో యూత్ ఐకాన్ గా మారిన సిద్దు జొన్నలగడ్డ Siddhu jonnalagadda) హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ (SVCC bannar) పై బొమ్మరిల్లు భాస్కర్(bommarillu bhaskar) డైరెక్షన్లో వస్తున్న

Jack movie review

Jack Trailer | డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీలతో యూత్ ఐకాన్ గా మారిన సిద్దు జొన్నలగడ్డ Siddhu jonnalagadda) హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ (SVCC bannar) పై బొమ్మరిల్లు భాస్కర్(bommarillu bhaskar) డైరెక్షన్లో వస్తున్న మూవీ జాక్ (JACK). ఈ మూవీపై మొదటి నుండి కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు సిద్దు జొన్నలగడ్డ హీరో ఒక కారణం అయితే యూత్ పల్స్ తెలిసిన డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో మూవీ తెరకెక్కుతుండడంతో ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొంది. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ ట్రైలర్ ని కట్ చేశారు.

లేటెస్ట్ గా రిలీజ్ అయిన Jack ట్రైలర్ పై ఆడియన్స్ లో క్రేజీ రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్ లోనే ప్రకాష్ రాజ్ వాయిస్ తో ఈస్ట్ , వెస్ట్ , సౌత్, నార్త్ లో నలుగురు టెర్రరిస్టులు వీరందరికీ ఒక లీడర్ అంటూ మొదలు పెడతాడు. దీన్ని బట్టి చూస్తే..ఈ మూవీ దేశంలోకి చొరబడ్డ టెర్రరిస్టులను అంతం చేసే ఒక మిషన్ లాగా కనబడుతుంది. ప్రమాదాన్ని సృష్టించే టెర్రరిస్టులను అధికారులు ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ మూవీ స్టోరీ లాగా తెలుస్తోంది.

ఇందులో ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా యాక్ట్ చేస్తుండగా సిద్దు జొన్నలగడ్డ వీరికి సాయపడే వ్యక్తిగా నటిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఒక డిఫరెంట్ స్టైల్ లో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఫన్ చూపెడుతూనే మరోవైపు సీరియస్ మోడ్ లో కథను ముందుకు తీసుకుపోయినట్టు తెలుస్తోంది. హీరోయిన్ వైష్ణవి చైతన్య గ్లామర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది.

Jack Movie : సరికొత్తగా హీరో క్యారెక్టరైజేషన్..

సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి (vaishnavi)కాంబినేషన్లో వచ్చే లవ్ సీన్స్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకునేలా డిజైన్ చేసినట్లు ట్రైలర్ లో తెలుస్తోంది. హీరో క్యారెక్టరైజేషన్ ని డైరెక్టర్ వెరైటీ గా డిజైన్ చేశాడు.కానీ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీలో ఏదైతే బాడీ లాంగ్వేజ్ ఉందో ఈ మూవీలో కూడా అదే బాడీ లాంగ్వేజ్ ను చూపెట్టారు. యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేసే విధంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. చాలా ఇంట్రెస్ట్ గా ఈ మూవీ ఉండబోతుందనిపించింది.

ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్…

ఏదేమైనా సిద్దు జొన్నలగడ్డ రెగ్యులర్ గా తను యాక్ట్ చేసిన మూవీల కంటే భిన్నమైన మూవీ ఎంచుకోగా లవ్ స్టోరీస్ ని తెరకెక్కించడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ తన కంఫర్ట్ జోన్ నుండి పూర్తిగా బయటకు వచ్చి Jack Movie ని డైరెక్ట్ చేశారు. ఏప్రిల్ 10 (April 10)న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. బీవీఎస్ఎన్ ప్రసాద్ (bvsn prasad) నిర్మించిన ఈ మూవీలో ఇప్పటికే రెండు పాటలు రిలీజై ఆకట్టుకుంటున్నాయి.సామ్ సీఎస్ (sam cs) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా అచ్చు రాజమణి పాటలు అందించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!