Sarkar Live

NTR Devara sequel : దేవర సీక్వెల్ కష్టమేనా..?

NTR Devara sequel : బాహుబలి మూవీ రెండు పార్టులుగా వచ్చి హిట్టు కొట్టిన తర్వాత ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా పెరిగిపోయింది. ఒకప్పుడు బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఉండేది. టాలీవుడ్ లో జక్కన్న ఈ ట్రెండ్ తో భారీ హిట్టు

NTR Devara sequel

NTR Devara sequel : బాహుబలి మూవీ రెండు పార్టులుగా వచ్చి హిట్టు కొట్టిన తర్వాత ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా పెరిగిపోయింది. ఒకప్పుడు బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఉండేది. టాలీవుడ్ లో జక్కన్న ఈ ట్రెండ్ తో భారీ హిట్టు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారు. ఒక స్టోరీ పరిధిని పెంచి కలెక్షన్స్ రాబట్టి పెట్టుబడికి పదింతలు భారీ వసూళ్లు రాబట్టవచ్చని బాహుబలితో నిరూపించాడు. ఆ బాటలోనే కొన్ని మూవీస్ వచ్చినా అనుకున్నంత రేంజ్ లో మాత్రం ఆడలేదు.

ఎన్టీఆర్ మేనియాతోనే దేవర హిట్టు…

కొరటాల శివ (koratala shiva)డైరెక్షన్ లో వచ్చిన దేవర(Devara) హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చినా అనుకున్నంత స్థాయిలో హిట్టు కొట్టలేదు. మూవీ ఎన్టీఆర్(ntr) మేనియాతోనే ఆడిందని చెప్పొచ్చు. అయితే మూవీ ఎండ్ లో సీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. మూవీ బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఇప్పటికే దానికి సంబంధించిన పనులు షురూ అయ్యేవి. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను చాలా డిజప్పాయింట్ చేసింది.

వెంటనే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 (war 2)లో జాయిన్ అయ్యారు. రీసెంట్ గా మూవీ రిలీజ్ అయి డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ నే దేవర సీక్వెల్ కి అడ్డంకిగా మారినట్టు తెలుస్తుంది. అంతగా హైప్ ఉన్న వార్ మూవీ సీక్వెలే ఆడలేదు. అంతంత మాత్రానా హిట్టు కొట్టిన దేవర ఆడుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.

NTR Devara sequel : ఇప్పటికే రెండు సిట్టింగ్స్..

కొరటాల మాత్రం సినిమాను తెరకెక్కించాలనే ఇంట్రెస్ట్ తో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు మూడు సిట్టింగ్ లు కూడా కంప్లీట్ అయ్యాయట. కానీ స్టోరీ కంటిన్యూ చేస్తే వర్కౌట్ అవ్వదు అన్న అనుమానాలు కూడా వస్తున్నాయట. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కు ఎన్టీఆర్ ఒకే చెప్పినా సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా టైమ్ తీసుకునేలా ఉంది.ప్రజెంట్ ప్రశాంత్ నీల్(prashanth neel)డైరెక్షన్ లో డ్రాగన్ మూవీ చేస్తున్నారు. ఆ మూవీ తరవాత త్రివిక్రమ్ (Trivikram)తో ఓ మూవీ ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వెంకీ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీ రీసెంట్ గానే మొదలైంది. ఇది కంప్లీట్ అయ్యేలోపు ప్రశాంత్ నీల్ మూవీ కి గుమ్మడికాయ కోరుతారు. వెంటనే త్రివిక్రమ్ తో మూవీ మొదలవుతుంది. ఇవన్నీ చూస్తే దేవర సీక్వెల్ కి రెండు సంవత్సరాల పైనే పడుతుంది. అప్పటి వరకు దేవర పై ఎవరికీ ఇప్పుడున్న ఇంట్రెస్ట్ కూడా ఉండదని కూడా వినిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే దేవర సెకండ్ పార్ట్ కష్టమేనన్న టాక్ ఫిలిం నగర్ లో వినబడుతోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?