Sarkar Live

Train robbery | రాయ‌ల‌సీమ ఎక్స్‌ప్రెస్‌లో దొంగ‌ల హ‌ల్‌చ‌ల్‌

Train robbery : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి (Gutti in Anantapur district) దగ్గర నిజామాబాద్‌-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (Rayalaseema Express)లో సోమ‌వారం అర్ధ‌రాత్రి దోపిడీ దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. ఆగి ఉన్న రైలులోకి వచ్చి ప్రయాణికుల దగ్గర ఉన్న

Train robbery

Train robbery : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి (Gutti in Anantapur district) దగ్గర నిజామాబాద్‌-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (Rayalaseema Express)లో సోమ‌వారం అర్ధ‌రాత్రి దోపిడీ దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. ఆగి ఉన్న రైలులోకి వచ్చి ప్రయాణికుల దగ్గర ఉన్న బంగారం, డబ్బులు, విలువైన వస్తువులు (Train robbery) ఎత్తుకెళ్లారు. అమరావతి ఎక్స్‌ప్రెస్ (Amaravati Express) వెళ్లడానికి దారి ఇవ్వడానికి గుత్తి దగ్గర రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉండ‌గా దొంగలు ఆ రైలులోని 10 బోగీల్లోకి ఎక్కారు. ప్ర‌యాణికుల‌ను బెదిరించి వ‌రుస‌గా ఒక్కొక్క‌రి నుంచి ఆభ‌ర‌ణాలు, డ‌బ్బులు, విలువైన వ‌స్తువులు దోచుకున్నారు. దీంతో ప్రయాణికులు భీతిల్లిపోయారు. 20 మంది బాధిత ప్రయాణికులు (affected passengers) ఈ ఘ‌ట‌న‌పై తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Train robbery : స్పందించిన రైల్వే పోలీసులు

తిరుపతి రైల్వే పోలీసులు (Railway Police) సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. రైలు ఎందుకు ఆగింది.. భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో కూడా విచారణ (investigating )చేస్తున్నారు.

ప్రయాణికుల్లో ఆందోళన

రైలు ప్రయాణికుల్లో ఈ సంఘటన (Train robbery) భయాందోళనలు కలిగించింది. రాత్రిపూట రైళ్లలో ప్రయాణించే వారిలో అభ‌ద్ర‌తా భావం నెల‌కొంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ‌ను ప్రయాణికులు కోరుతున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!