Tamil Star Vijay | తమిళ హీరో దళపతి విజయ్, హీరోయిన్ త్రిష (Trisha Krishnan) గురించి ఏ వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. కోలీవుడ్ లో వీరి కాంబినేషన్ లో చాలా మూవీస్ వచ్చి హిట్ అయ్యాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా గిల్లి ఈ మూవీ సూపర్ హిట్ అయింది ఆ తర్వాత తిరుపతి, ఆది, కురవి ఇలాంటి మూవీస్ లో నటించడంతో క్రేజీ కాంబినేషన్ గా పేరు వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్ లో లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj ) డైరెక్షన్ లో లియో అనే మూవీ వచ్చి బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది.
ఆన్ స్క్రీన్ లో వీరి కెమిస్ట్రీ తో ఆడియన్స్ మనసు దోచుకున్నారు. ఒక హీరో హీరోయిన్ ఒక మూవీ హిట్టు అయితే డైరెక్టర్ వారి కాంబినేషన్ రిపీట్ చేస్తుంటారు. అలా వరుసగా మూవీస్ తీస్తే వారు రిలేషన్ లో ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తాయి. త్రిష (Trisha ) కు కూడా చాలా మంది హీరోలతో అఫైర్స్ ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. సినీ ఇండస్ట్రీలో ఉన్నవారందరికీ ఇది ఫేస్ చేస్తూనే వుంటారు.
ఆన్ స్క్రీన్ హిట్టు జోడీ విజయ్ (Dalapathi Vijay), త్రిష మధ్య కూడా ఆఫ్ స్క్రీన్ లో వీరి మధ్య ఏదో ఉందని రూమర్స్ ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. వీరు కూడా ఈ విషయంపై మాట్లాడలేదు. అప్పుడప్పుడు త్రిష విజయ్ మంచి స్నేహితుడని అంటుంది. విజయ్ రాజకీయ పార్టీని స్థాపించి దానిలో బిజీగా ఉన్నారు. ఇటీవల త్రిష కూడా రాజకీయాల్లోకి వెళ్లాలని ఉందని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. కొందరైతే త్రిష విజయ్ పార్టీలో చేరుతుందనే ఊహాగానాలు కూడా ఆ మధ్య మొదలయ్యాయి. కానీ త్రిష మదర్ ఉమా కృష్ణ ఇటీవల ఆ వార్తలను ఖండించారు.
Vijay Next Movie : విజయ్ తర్వాత సినిమా జననాయక్
ప్రస్తుతం విజయ్ హెచ్ వినోద్ డైరెక్షన్ లో జననాయక్ మూవీ (Jan Nayak Movie)లో యాక్ట్ చేస్తున్నారు. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ ఆఖరి మూవీ గా ప్రచారం జరుగుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.
కాగా ఇటీవల త్రిష విజయ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. షూటింగ్లో ఉన్నప్పుడు శింభు అయితే తనను టీజ్ చేస్తాడని అదే విజయ్ అయితే ఒక మూలన కూర్చొని మౌనంగా ఉండిపోతాడని చెప్పింది. ఇది ఇలా ఉండడం త్రిష కు అస్సలు నచ్చదు. దాన్ని ఆయన మార్చుకోవాలి అని కూడా చెప్పుకొచ్చింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







