Sarkar Live

Trivikram | త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై క్లారిటీ

వెంకటేష్, ఎన్టీఆర్‌తో రెండు భారీ ప్రాజెక్టులు Trivikram Next Movies 2025 | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram)నుండి మూవీ వచ్చి చాలా కాలమే అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు(super star Mahesh Babu)తో గుంటూరు కారం (guntur kaaram) మూవీ

Trivikram

వెంకటేష్, ఎన్టీఆర్‌తో రెండు భారీ ప్రాజెక్టులు

Trivikram Next Movies 2025 | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram)నుండి మూవీ వచ్చి చాలా కాలమే అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు(super star Mahesh Babu)తో గుంటూరు కారం (guntur kaaram) మూవీ తర్వాత అల్లు అర్జున్(Allu Arjun)తో మూవీ ప్లాన్ చేసుకున్నారు. ఆ మూవీ స్క్రిప్ట్ పై చాలా కాలం వర్క్ చేశాడు. మైథాలజికల్ జానర్లో మూవీ ఉండబోతుందని కూడా ప్రచారం జరిగింది. పూర్తి స్క్రిప్ట్ రెడీ కానందువల్ల డిలే అవుతూ వచ్చింది.

అంతలో పుష్ప 2(pushpa -2) తో ఇండియన్ రికార్డులు క్రియేట్ చేసి సుకుమార్ అల్లు కాంబో భారీ కలెక్షన్స్ రాబట్టింది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో తీయబోయే మూవీ ఈ టైమ్ లో కరెక్ట్ కాదనుకున్నారో ఏమో అట్లీ లైన్ లోకి వచ్చాడు. అల్లు అట్లీ(Allu Atlee combo) కాంబో సినిమా అనౌన్స్ మెంట్ కూడా అయిపోయింది. ఇందులో హీరోయిన్ గా దీపిక పదుకొనె (Deepika Padukone)యాక్ట్ చేస్తోందని క్లారిటీ ఇస్తూ వీడియో కూడా రిలీజ్ చేశారు.

అల్లు అర్జున్ తో మూవీ సైడ్ అయిపోయాక త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తో మూవీ ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. వెంకటేష్(victory venkatesh), ఎన్టీఆర్(NTR), రామ్ (Ram) తో కూడా మూవీలు ఉంటాయని టాలీవుడ్ లో టాక్ వినబడింది. దీనిపై సూర్యదేవర నాగవంశీ(Surya devara nagavamshi) క్లారిటీ ఇస్తూ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. త్రివిక్రమ్ నెక్స్ట్ వెంకటేష్, ఎన్టీఆర్ లతో మూవీ చేస్తారని చెప్పారు.

Trivikram : ఫ్యామిలీ జానర్ లో వెంకీ..?

కొద్ది రోజులుగా త్రివిక్రమ్ కొందరు హీరోలతో మూవీ చేస్తారనే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్నారు.నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ తో తీయబోయే మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేయబోతున్నారట. ఫ్యామిలీ జానర్ లో వెంకటేష్ చాలా మూవీస్ తీశాడు. త్రివిక్రమ్ కూడా ఫ్యామిలీ మూవీస్ పై పట్టు ఉంది. కామెడీ లో కూడా తిరుగులేదు.ఇది వరకు వెంకటేష్ మూవీస్ కి డైలాగ్ రైటర్ గా కూడా పనిచేశారు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి మూవీస్ కి పనిచేసిన త్రివిక్రమ్ తన మార్క్ పంచ్ డైలాగ్ లతో అదరగొట్టాడు. ఇప్పటికి కూడా ఆ మూవీస్ లోని సీన్స్ ని ఇష్టపడే వారు ఉన్నారు.

పురాణాల ఆధారంగా ఎన్టీఆర్ మూవీ..?

ఇక ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మూవీ కూడా ఆడియన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందనడంలో సందేహం లేదంటున్నారు. ఇక ఎన్టీఆర్ తో మూవీ పురాణాల ఆధారంగా తీయబోతున్నారని తెలుస్తోంది.మొత్తానికైతే నాగవంశీ పోస్ట్ తో త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీపై ఒక క్లారిటీ అయితే వచ్చింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!