- జి.ఓ నంబర్ 252ను వెంటనే సవరించాలి
- రెండు కార్డుల విధానం వద్దు.. 10 వేల కార్డుల కోతపై ఆగ్రహం
- డెస్క్ జర్నలిస్టులకు, కేబుల్ ఛానళ్లకు అన్యాయం
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోసం జారీ చేసిన జి.ఓ నంబర్ 252 తీవ్ర లోపభూయిష్టంగా ఉందని, దీనివల్ల వేలాది మంది జర్నలిస్టులు తమ హక్కులను కోల్పోతున్నారని TUWJ (తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) ధ్వజమెత్తింది. ఈ అనాలోచిత జీవోను నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు భారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు యూనియన్ ప్రకటించింది.
మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, కోశాధికారి పి.యోగనంద్, టెంజు ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, ఐజేయు నేత అవ్వారి భాస్కర్ తదితరులు మాట్లాడారు.
జీవోలోని ప్రధాన లోపాలు – TUWJ అభ్యంతరాలు:
- రెండు కార్డుల గందరగోళం : అక్రిడిటేషన్ కార్డు, మీడియా కార్డు పేరిట రెండు రకాల కార్డులను తేవడం వల్ల జర్నలిస్టుల మధ్య విభేదాలు వస్తాయని, అందరికీ సమాన ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
- భారీగా కోత : గతంలో 23 వేల కార్డులు ఉండగా, కొత్త నిబంధనల వల్ల దాదాపు 10 వేల మంది జర్నలిస్టులు కార్డులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
- డెస్క్ జర్నలిస్టుల విస్మరణ : డెస్క్ జర్నలిస్టులను రిపోర్టర్ల నుంచి వేరు చేయడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని మండిపడ్డారు.
- కేబుల్ ఛానళ్లపై వివక్ష : గతంలో కేబుల్ ఛానళ్లకు ఉన్న అక్రిడిటేషన్లను ప్రస్తుత జీవోలో పూర్తిగా తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
- అనుభవంపై ఆంక్షలు : ఇండిపెండెంట్ జర్నలిస్టుల అనుభవాన్ని 10 నుంచి 15 ఏళ్లకు పెంచడం అన్యాయమని, ఇది జర్నలిజాన్ని అణచివేయడమేనని అన్నారు.
మీడియా అకాడమీ చైర్మన్ పై విమర్శలు:
మీడియా అకాడమీ చైర్మన్ తన సొంత యూనియన్ పంతం నెగ్గించుకోవడానికి డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని నేతలు ఆరోపించారు. సీఎంకు తప్పుడు సమాచారం ఇచ్చి జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టేలా ఈ జీవోను రూపొందించారని వారు విమర్శించారు.
కార్యాచరణ:
ప్రభుత్వం వెంటనే స్పందించి జి.ఓ 252ను పునఃపరిశీలించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
- డిసెంబర్ 27: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా.
- డిమాండ్: అర్హులైన ప్రతి జర్నలిస్టుకు (డెస్క్, ఫీల్డ్, కేబుల్ ఛానల్స్) పాత పద్ధతిలోనే కార్డులు జారీ చేయాలి.
ఈ కార్యక్రమంలో నవీన్ కుమార్ యారా, రాకేష్ రెడ్డి, బాపూరావు తదితర జర్నలిస్ట్ నేతలు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి







