Sarkar Live

Veteran actress Krishnaveni | అల‌నాటి సినీ న‌టి కృష్ణ‌వేణి ఇక లేరు

అలనాటి ప్రముఖ నటి, గాయని, నిర్మాత సి.కృష్ణవేణి (Veteran actress Krishnaveni) ఇకలేరు. ఈ రోజు ఉద‌యం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన స్వగృహంలో ఆమె క‌న్నుమూశారు. కృష్ణ‌వేణికి 102 ఏళ్లు. వ‌యోభారం కార‌ణంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె తుది శ్వాస విడిచారు.

actress Krishnaveni

అలనాటి ప్రముఖ నటి, గాయని, నిర్మాత సి.కృష్ణవేణి (Veteran actress Krishnaveni) ఇకలేరు. ఈ రోజు ఉద‌యం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన స్వగృహంలో ఆమె క‌న్నుమూశారు. కృష్ణ‌వేణికి 102 ఏళ్లు. వ‌యోభారం కార‌ణంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె తుది శ్వాస విడిచారు.

సతీ అనసూయ సినిమాతో Krishnaveni తెర‌గేట్రం

చిత్త‌జ‌ల్లు కృష్ణ‌వేణి (Chittajallu Krishnaveni) 1924 డిసెంబరు 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచి కళల పట్ల ఆసక్తి చూపిన ఆమె పాటలు పాడుతూ, నాటకాలు వేస్తూ ఆక‌ట్టుకొనేవారు. కృష్ణవేణి సినీ ప్రస్థానం 1936లో ప్రారంభ‌మైంది. ‘సతీ అనసూయ’ సినిమాతో ఆమె తెర‌గేట్రం చేశారు. అందం, అభినయం, మధురమైన గాత్రంతో సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రం త‌ర్వాత కృష్ణవేణి తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

ఎన్టీఆర్‌, ఘంట‌సాలకు తొలి అవ‌కాశం ఇచ్చింది కృష్ణ‌వేణే..

మీర్జాపురం రాజా (మేకా రంగయ్య)తో 1940లో కృష్ణవేణి వివాహం జ‌రిగింది. రాజా కూడా సినిమాల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి. వీరిద్దరూ కలిసి చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. ఒక వైపు నటన‌ను కొనసాగిస్తూనే నిర్మాతగా కూడా కృష్ణ‌వేణి రాణించారు. ‘మన దేశం’ సినిమాతో తెలుగు సినిమా రంగానికి మ‌హాన‌టుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ను పరిచయం చేసింది కృష్ణవేణే. అంతే కాకుండా లెజెండరీ సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకు కూడా తొలిచిత్ర అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత ఆమెనే. నటనా రంగంతో పాటు మంచి నేపథ్య గాయనిగా కూడా కృష్ణ‌వేణి పేరు తెచ్చుకున్నారు. ఆమె గాత్రంలో ఉన్న మాధుర్యం ఎన్నో చిత్రాలకు జీవం పోశాయి.

actress Krishnaveni మృతిపై చంద్ర‌బాబు సంతాపం

కృష్ణవేణి మృతి ప‌ట్ల సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తన సంతాపాన్ని తెలిపారు. నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో కృష్ణ‌వేణి ప్ర‌త్యేక అధ్యాయ‌మ‌ని అన్నారు. ఎన్టీఆర్ నటజీవితానికి తొలి అవకాశం ఇచ్చింది కృష్ణవేణే అని తెలిపారు. ఇటీవల ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల్లో ఆమెను తాను సత్కరించానని, ఇది త‌న‌ జీవితంలో ఓ మధురమైన స్మృతి అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!