భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ (Vice President Jagdeep Dhankhar) అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రిలో చేరారు. ఛాతీలో అసౌకర్యం, నొప్పి (uneasiness and chest pain) కారణంగా కుటుంబ సభ్యులు ఆయన్ను ఎయిమ్స్‌కు తరలించారు. 73 ఏళ్ల ధంఖర్ ప్రస్తుతం ధంఖర్ కార్డియాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నారు.
Vice President Jagdeep Dhankhar : నిలకడగానే ఆరోగ్యం
కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ నేతృత్వంలో ఎయిమ్స్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్ (Critical Care Unit -CCU)లో ధంఖర్ చికిత్స పొందుతున్నారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని సహాయాలను అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ధంఖర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, నిరంతరం వైద్య పరిశీలన (stable and under observation)లో ఉన్నారని సమాచారం.
ఆరోగ్య పరిస్థిని ఆరా తీసిన రాష్ట్రపతి, ప్రధాని
ఉప రాష్ట్రపతి Jagdeep Dhankhar ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ధంఖర్‌కు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర రాజకీయ ప్రముఖులు కూడా ధంఖర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపించారు.
రాజకీయ నేతలు, ప్రముఖుల్లో ఆందోళన
న్యాయవాదిగా, భారతీయ జనతా పార్టీ కీలక నేతగా జగదీప్ ధంఖర్ (Jagdeep Dhankhar) పలు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. 2022 ఆగస్టు 11న భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ అల్వాను ఓడించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తున్న ఆయన, అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరడం పట్ల రాజకీయ నేతలు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని తిరిగి తన బాధ్యతలు నిర్వహించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. అనేక మంది ప్రముఖులు ఎయిమ్స్ ఆస్పత్రిని సందర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ధంఖర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని బీజేపీ ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ఆకాంక్షలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఆస్పత్రి వద్దకు వచ్చిన సామాన్య జనం
సామాన్య ప్రజలు, సామాజిక కార్యకర్తలు కూడా ధంఖర్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఆస్పత్రికి వద్దకు చేరుకొని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అనేక మంది ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆయన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ భారీ సంఖ్యలో సందేశాలు వెలువడుతున్నాయి. ఉప రాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ త్వరలోనే ఆయన ఆరోగ్యంపై మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.
కేంద్ర ప్రభుత్వ పకడ్బందీ చర్యలు
ధంఖర్‌కు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఎయిమ్స్ వైద్యులు ధంఖర్ ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అవసరమైన అన్ని వైద్య చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకొని తిరిగి తన అధికారిక బాధ్యతలు నిర్వర్తిస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..