Sarkar Live

Vijay Devarakonda | పెళ్లిచూపులు కాంబో రిపీట్..?

విజయ్ దేవరకొండ- తరుణ్ భాస్కర్ (Vijay Devarakonda -Tharun Bhaskar) కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ పెళ్లిచూపులు (Pelli chupulu). ఈ మూవీ డైరెక్టర్ గా తరుణ్ భాస్కర్ కి మొదటి సినిమా కాగా హీరోగా విజయ్ దేవరకొండకి కూడా

Vijay Devarakonda

విజయ్ దేవరకొండ- తరుణ్ భాస్కర్ (Vijay Devarakonda -Tharun Bhaskar) కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ పెళ్లిచూపులు (Pelli chupulu). ఈ మూవీ డైరెక్టర్ గా తరుణ్ భాస్కర్ కి మొదటి సినిమా కాగా హీరోగా విజయ్ దేవరకొండకి కూడా మొదటి హిట్ ఇచ్చిన సినిమా కావడం విశేషం. అయితే ఈ మూవీ తర్వాత వీరి కాంబో మళ్లీ సెట్ అవ్వలేదు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది (E Nagaraniki Yemaindhi) అనే మూవీ తీసి పర్వాలేదనిపించు కున్నాడు. తర్వాత తను డైరెక్షన్ వదిలేసి యాక్టింగ్ లో కి దిగాడు. యాక్టర్ గా ఓకే అనిపించుకున్న కానీ ఆ మూవీస్ సరైన ఫలితాన్ని చూడలేదు.

కొద్ది నెలల క్రితం తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన కీడా కోలా (keedakola)మూవీ కూడా ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ గా మంచి ఫ్యూచర్ ఉన్న తరుణ్ భాస్కర్ డైరెక్షన్ మీద ఫోకస్ చేయకుండా నటుడుగా కొన్ని సినిమాలు చేస్తూ ఉండడం తన డైరెక్షన్ కెరీర్ కి మైనస్ గా మారుతుందని విమర్శలు కూడా ఆ మధ్య వచ్చాయి.

ఆ సీక్వెల్ ఆగినట్టే..?

కొన్ని సినిమా ల్లో నటుడుగా మెరిసిన తను బేసిగ్గా రచయిత,డైరెక్టర్ కాబట్టి మళ్లీ అందులోనే బిజీ అవ్వాలనుకుంటున్నాడట. తన తర్వాతి ప్రాజెక్టుకి ఏ హీరోను సెట్ చేసుకుందామా అనుకుంటుండగా తను తీసిన ఈ నగరానికి ఏమైంది అనే మూవీకి సీక్వెల్ చేయాలనే ప్లాన్ చేశాడట. అందులో హీరోగా విశ్వక్ సేన్ ని తీసుకుంటాడని ఫిలింనగర్లో టాక్ వినిపించింది. కానీ విశ్వక్సేన్ సినిమాలు ఈ మధ్య సరైన విధంగా ఆడక పోవడం కూడా ఈ ప్రాజెక్టు వెనక్కి వెళ్ళిందనే ప్రచారం కూడా జరుగుతుంది.

బిజీ బిజీగా Vijay Devarakonda

ఒక కొత్త స్టోరీ తో తరుణ్ భాస్కర్ తన మొదటి సినిమా హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda )ను సంప్రదించాడట. తనకు హిట్టు ఇచ్చిన డైరెక్టర్ మళ్ళీ స్టోరీ చెబితే విజయ్ దేవరకొండ నో చెప్తాడా ఎస్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మొదటి సినిమా నుండి వీరి మధ్య మంచి బాండింగ్ ఉండటం వల్ల ఈ ప్రాజెక్టు సెట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ విజయ్ దేవరకొండ పెద్దపెద్ద బ్యానర్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.ఆయన రేంజ్ మారింది. ఇప్పుడు చేసేవన్నీ కూడా పెద్ద ప్రాజెక్ట్స్. అయిన ఈ గ్యాప్ లో తనకు హిట్టు ఇచ్చిన తరుణ్ భాస్కర్ కి ఛాన్స్ ఇవ్వడం అనేది గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఏదేమైనా పెళ్లిచూపులు మూవీ తర్వాత ఈ కాంబో రిపీట్ అవుట్ అవుతుండడంతో ఆడియన్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ కాంబోపై కొద్దిరోజుల్లోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

One thought on “Vijay Devarakonda | పెళ్లిచూపులు కాంబో రిపీట్..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!