Visakhapatnam | విశాఖపట్నం జిల్లా తాటిచెట్లపాలెంలో ఇటీవల జరిగిన ఘటన స్థానికులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఒక మైనర్ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి కాలువలో పడేసిన విషయం తెలిసిందే.. కాలువలో అనుమానాస్పదంగా శరీర భాగాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని భాగాలను సేకరించి, విశాఖ కేజీహెచ్ ల్యాబ్‌కు పంపించారు.
అయితే ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, 24 గంటలు గడిచినా గుర్తించేలా ఏ ఆధారమూ లభించలేదు. ముఖ్యంగా బాలిక తల భాగం ఇప్పటికీ కనబడకపోవడం విచారణను మరింత క్లిష్టంగా మార్చింది. తాటిచెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు ఇటీవల ప్రసవించిన మహిళల వివరాలను ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు సేకరిస్తున్నారు.
పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు:
అక్రమ సంబంధం నేపథ్యంలో పుట్టిన శిశువును హత్య చేసి పారేసారా? లేదా అమావాస్య రోజున క్షుద్రపూజల నిమిత్తం హత్య జరిగిందా? గ్రామస్థులు కేసును అత్యంత త్వరగా చేధించాలని పోలీసుల్ని కోరుతున్నారు.







