Sarkar Live

Real Estate | రియల్టర్ల వెంచర్ మాయ..

Warangal : అనుమతి లేని వెంచర్ (Real Estate Ventures) లు చేయడంతోపాటు, ఆ వెంచర్ లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించడంలో ఆ రియల్టర్లు ఆరితేరిపోయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరి ధన దాహానికి ప్లాట్లు (Flots) కొనే వారితోపాటు, అధికారులు సైతం

Real Estate Ventures
  • సర్వే నెంబర్ ఓచోట.. ప్లాట్లు చేసింది మరోచోట..
  • నాలా కన్వర్షన్ లతో రిజిస్ట్రేషన్ లు చేసి ప్లాట్లు అమ్మకం
  • అనుమతి లేకుండా వెంచర్ ..చక్రం తిప్పిన కార్పొరేటర్…

Warangal : అనుమతి లేని వెంచర్ (Real Estate Ventures) లు చేయడంతోపాటు, ఆ వెంచర్ లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించడంలో ఆ రియల్టర్లు ఆరితేరిపోయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరి ధన దాహానికి ప్లాట్లు (Flots) కొనే వారితోపాటు, అధికారులు సైతం చిక్కుల్లో పడే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. అక్రమంగా వెంచర్ లు చేయడం,అక్రమ పద్ధతుల్లో అందులోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ లు చేపించడం వీరికి పరిపాటిగా మారినట్లు తెలుస్తోంది. సంపాదనే ధ్యేయంగా నాన్ లేఅవుట్ వెంచర్ లు చేసే వీరు అందులోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేపించడం కోసం గతంలో నకిలీ నాలా ప్రొసీడింగ్ లు కూడా సృష్టించడం అప్పట్లో ఓరుగల్లు లో సంచలనం సృష్టించడంతో పాటు ఓ తహశీల్దార్ సైతం ఆ నకిలీ నాలా ప్రొసీడింగ్ లపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.ఇదిలా ఉండగా ఈ రియల్టర్ లు ఇటీవలే చేసిన ఓ వెంచర్ నిబంధనలకు విరుద్ధమని,అసలు వీరు చేసిన వెంచర్ కు ,ఆ భూమి యొక్క సర్వే నెంబర్ కు అసలు సంబంధమే లేదని ప్రచారం జరుగుతోంది. సదరు రియల్టర్ ల మాయలో ఓ కార్పొరేటర్ చిక్కడంతో వీరి అక్రమ వెంచర్ కు ఎలాంటి ఇబ్బందులు రావడంలేదని విశ్వసనీయ సమాచారం.

సర్వే నెంబర్ కు సంబంధంలేని భూమిలో వెంచర్ …

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ (GWMC) 17 వ డివిజన్ పరిధిలోని బొల్లికుంటలో ఇటీవల వెలిసిన ఓ వెంచర్ వ్యవహారం ఇప్పుడు ఆ డివిజన్ తో పాటు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది.విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బొల్లికుంటలో ఆ రియల్టర్ లు చేసిన వెంచర్ కు వారికి ఉన్న సర్వే నెంబర్ కు అసలు సంబంధమే లేదని,ఆ విషయం సదరు రియల్టర్ లకు తెలిసినప్పటికీ అటు రెవెన్యూశాఖ తో పాటు, ఇటు రిజిస్ట్రేషన్ శాఖ (Registration) అధికారులను మోసం చేసి ప్లాట్లను నాలా కన్వర్షన్ చేపించి తద్వారా సబ్ రిజిస్ట్రార్ వద్ద రిజిస్ట్రేషన్ చేపించినట్లు తెలిసింది. అసలు విషయం ఏమిటంటే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నించాల్సిన ఓ కార్పొరేటర్ తెర వెనుక ఉంటూ సదరు రియల్టర్ లను ముందు పెట్టి సర్వే నెంబర్ కు సంబంధంలేని భూమిలో అనుమతి లేకుండా వెంచర్ చేపించడంతోపాటు, నాలా కన్వర్షన్ లు చేయాలని అధికారులపై ఒత్తిడి చేయడం, దానితోపాటు సబ్ రిజిస్ట్రార్ వద్ద ప్లాట్లను సైతం రిజిస్ట్రేషన్ చేపించినట్లు తెలిసింది. అక్రమ వెంచర్ లను అడ్డుకోవాల్సిన కార్పొరేటరే ఇలా అడ్డదారిలో రియల్టర్ లను ముందుపెట్టి కార్పొరేషన్ ఆదాయానికి గండికొట్టడం, అదీ సర్వే నెంబర్ కు సంబంధంలేని భూమిలో వెంచర్ చేపించడం గమనార్హం.

Real Estate : అక్రమాలకు పాల్పడటం వారికి అలవాటేనా?

వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలోని బొల్లికుంట కేంద్రంగా కొంతమంది రియల్టర్ అనుమతి లేకుండా వెంచర్ చేయడంతోపాటు అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో అసలు సర్వే నెంబర్ తో సంబంధమే లేని భూమిలో అక్రమంగా వెంచర్ చేసిన వీరు ఓ కార్పొ రేటర్ సహకారంతో ప్లాట్లను నాలా కన్వర్షన్ లు చేపించుకొని రిజిస్ట్రేషన్ సైతం చేసినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా గతంలో వీరు ఇదే గ్రామ రెవెన్యూ పరిధిలో అక్రమంగా ఓ వెంచర్ చేసి అందులోని ప్లాట్లను నాలా కన్వర్షన్ చేసినట్లుగా నకిలీ నాలా ప్రొసీడింగ్ లు సృష్టించి సబ్ రిజిస్ట్రార్ వద్ద ఆ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేపించినట్లు సమాచారం.ఈ వ్యవహారం బయటపడటంతో నాటి ఖిలా వరంగల్ తహశీల్దార్ పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నకిలీ నాలా ప్రొసీడింగ్ లు తయారు చేయడంలో ఈ రియల్టర్ లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉండే ఓ డాక్యుమెంట్ రైటర్ కూడా పూర్తిస్థాయిలో సహకారం అందించినట్లు తెలియవచ్చింది. గతంలో ఓ వెంచర్ లోని ప్లాట్లకు నకిలీ నాలాలు సృష్టించడం, ఇప్పుడు సర్వే నెంబర్ కు సంబంధంలేని భూమిలో వెంచర్ చేయడం చూస్తుంటే అక్రమాల్లో వీరు ఆరితేరిపోయినట్లు కనిపిస్తోంది.

  • నాలా కన్వర్షన్ లను తహశీల్దార్ రద్దు చేస్తారా…?
  • ఆ వెంచర్ లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ ఆ డాక్యుమెంట్లను బ్లాక్ లిస్ట్ లో పెడతారా..?
  • గతంలో నమోదైన నకిలీ నాలా ప్రొసీడింగ్ ల కేసు ఏమైనట్లు..?ఆ రిజిస్ట్రేషన్ లను క్యాన్సిల్ చేశారా..?

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?