వరంగల్: ఓరుగల్లులో (Warangal)లో ఉగ్రవాదుల (Terrorists) కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నగరానికి చెందిన వ్యక్తికి పాకిస్తాన్ ఉగ్రవాదుల (Pakistan Terrorists)తో సంబంధాలు ఉన్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఉగ్రవాదుల కదలికల ప్రచారంతో వరంగల్ వాసుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. వరంగల్ జాన్‌పాకకు చెందిన జక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఈ మేరకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు జక్రియాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 25న శ్రీలంకకు వెళ్తుండగా.. జక్రియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, నిందితుడు జక్రియా వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద బిర్యానీ సెంటర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. అతనికి కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
కాగా అరెస్టు అయిన వ్యక్తి భారత్ లో మతమార్పిడులను ప్రోత్సహిస్తున్న జమాతే ఇస్లామీ సంస్థకు జాతీయాధ్యక్షుడని పోలీసులు తెలిపారు. శ్రీలంకలో జరుగుతున్న సదరు సంస్థ సమావేశాలకు విజయవాడకు చెందిన ఇద్దరితో కలిసి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి మతమార్పిడులకు సంబంధించిన వీడియోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. జక్రియను చెన్నైలో అదుపులోకి తీసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా జక్రియ తన కుటుంబంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నుంచి పది సంవత్సరాల క్రితం వరంగల్ (Warangal) నగరానికి కు వలస వచ్చినట్లు సమాచారం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








