Sarkar Live

చీమలకు భయపడి మహిళ ఆత్మహత్య ‌‌ – Sangareddy

Sangareddy | ఓ మహిళ మానసిక సమస్యలతో బాధపడుతూ తీవ్ర నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అత్యంత అరుదైన ఘటన అందరినీ కలచివేసింది. చీమల ఫోబియాతో (Myrmecophobia) ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా (Sangareddy district) అమీన్‌పూర్ లో నివసిస్తున్న

Nizamabad

Sangareddy | ఓ మహిళ మానసిక సమస్యలతో బాధపడుతూ తీవ్ర నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అత్యంత అరుదైన ఘటన అందరినీ కలచివేసింది. చీమల ఫోబియాతో (Myrmecophobia) ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా (Sangareddy district) అమీన్‌పూర్ లో నివసిస్తున్న గృహిణి మనీషా, ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వదిలిన సూసైడ్ నోట్‌లో “నాకు చీమలంటే చాలా భయం.. ఆ భయం నన్ను చంపేస్తోంది. నా కూతురిని జాగ్రత్తగా చూసుకోండి” అని రాసి ఉంది. ఈ లేఖను చూసిన కుటుంబ సభ్యులు, పోలీసులు, ఇరుగుపొరుగువారు షాక్‌కు గురయ్యారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు, కుటుంబ విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

చీమల పట్ల భయం అనేది ఓ చిన్న విషయం. అయితే దీనికేగా ఆమె ప్రాణం తీస్తుకుంటుందని ఎవరూ ఊహించలేదు. గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రమాద సమాచారం అందుకున్న అమీన్‌పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నదేమిటంటే — “ఫోబియాలు సకాలంలో గుర్తించి చికిత్స చేయించకపోతే తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారితీస్తాయి. ఇలాంటి ఘటనలు అందరికి ఒక పాఠంగా భావించాలని పలువురు హెచ్చరిస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?