యంగ్ టైగర్ ఎన్టీఆర్(young tiger NTR), ప్రశాంత్ నీల్ (prashanth neel)కాంబోలో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మూవీ టీం టైటిల్ పై అధికారికంగా ప్రకటన చేయలేదు. దీనిపై త్వరలోనే ఓ అప్డేట్ ఇవ్వనుంది. ఇదిలా ఉండగా మూవీ షూటింగ్ ను చాలా రోజుల క్రిత మే మొదలెట్టారు. ఎన్టీఆర్ లేని సీన్స్ ని తెరకెక్కించిన నీల్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను కూడా కంప్లీట్ చేశారు.
పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తిరకెక్కబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. NTR ఇన్ని రోజులు హృతిక్ రోషన్ (NTR Hrithik roshan combo) కాంబోలో వస్తున్న వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తి చేసుకుంది. ఇటీవల మూవీకి సంబంధించిన యాక్షన్ సీన్స్ ని, ఒక పాటని కంప్లీట్ చేశారు. కొద్దిమేర షూటింగ్ బ్యాలెన్స్ తప్ప అంతా కంప్లీట్ అయినట్టే. ఇక ఎన్టీఆర్ ఫోకస్ మొత్తం ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు పైనే ఉంటుంది.
22 నుండి సెట్స్ లో NTR..
చాలా రోజులుగా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ని ఇచ్చారు. ఈనెల 22 నుండి ఎన్టీఆర్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ తో యాక్షన్ సీన్స్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన లుక్స్ ని మొత్తం మార్చుకుని సన్నబడిపోయారు. ఇండియన్ సినీ చరిత్రలో ఈ మూవీ నిలబడేలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఇప్పటికే ఊహించుకుంటున్నారు. వారి ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా మూవీ ఉండబోతుందని కూడా మేకర్స్ హింట్ ఇస్తూనే ఉన్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ మూవీ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్ గా రుక్మిణి వసంత్..?
ప్రశాంత్ నీల్ అన్ని సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ నిచ్చిన రవి బస్రూర్ (Ravi Basroor)ఈ మూవీకి కూడా మ్యూజిక్ ని అందించబోతున్నారు. ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini vasanth)యాక్ట్ చేయబోతున్నట్లు ఓ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై (maithri movie makers and NTR arts bannar) తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో చూడాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.