తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్‌రెడ్డి ఖరారయ్యారు. ఆయనతో పాటు ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి(Abhishek Manu Singhvi )కూడా రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు అభ్యర్థులుగా వీరిద్దరినీ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వేం నరేందర్‌రెడ్డి పేరు ఖరారవడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీకి ఆయన చేసిన సేవలు, రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.








