Vikrant Massey | 12th Fail మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్రాంత్ మాస్సే (Vikrant Massey) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ నోట్ పెట్టారు. కొన్నేళ్లుగా అందరి నుంచి అసాధారమైన ప్రేమ, అభిమానాన్ని పొందుతున్నానని, చెప్పారు. ఇప్పటి వరకూ తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఓ తండ్రిగా, కొడుకుగా, భర్తగా బాధ్యతలు నెరవేర్చాల్సిన సమయం వొచ్చిదని అందుకే కొత్త సినిమాలను అంగీకరించడం లేదని పేర్కొన్నారు. ‘గత కొన్నేళ్లు అద్భుతంగా గడిచాయి. ఇంతకాలం నాపై ప్రేమ, అభిమానం చూపినవారందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు నా కుటుంబం కోసం సమయం వెచ్చించాల్సిన టైమ్ వచ్చింది. 2025లో రిలీజ్ అయ్యే సినిమానే నా చివరి మూవీ’ అని విక్రాంత్ మాస్సే ప్రకటించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానులతోపాటు సినీ ప్రియులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
కాగా, 37 ఏళ్ల విక్రాంత్ మాస్సే (Vikrant Massey).. టీవీ సీరియల్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఇక 2017లో ‘ఎ డెత్ ఇన్ ది గంజ్’తో వెండితెరపై హీరోగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. గత సవంవత్సరం వచ్చిన 12th Fail చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. విదు వినోద్ చోప్రా తీసిన 12th ఫెయిల్ సినిమా గతేడాది అక్టోబర్ 27వ తేదీన రిలీజైంది. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ఆ సినిమాను విడుదలగా అఖండ విజయం సాధించింది. ఇందులో ఐపిఎస్ అధికారి మనోజ్ పాత్రలో విక్రాంత్ మాసే అసమాన ప్రతిభ చూపారు. ఇక మేధాశంకర్ హీరోయిన్ పాత్రను పోషించారు. అనురాగ్ పాఠక్ రాసిన నవల ఆధారంగా 12th ఫెయిల్ సినిమాను తెరకెక్కించారు.