OYO Rooms New Booking Policy : పెళ్లి కాలేదా.. అయితే, నో పర్మిషన్.. ఓయో కొత్త పాలసీ
OYO Rooms New Booking Policy : పెళ్లికాని జంటలు ఇక నుంచి OYOకు వెళ్లడం కుదరదు. పెళ్లి అయ్యిందని బుకాయించి రూమ్ బుక్ చేసుకుందామన్నా వీలు కాదు. మ్యారీడ్ కపుల్‌కు మాత్రమే ఇక నుంచి OYO రూములు బుక్ చేసుకొనే అనుమతి ఉంటుంది. ఈ కొత్త విధానాన్నిOYO సంస్థ అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం యూపీలో ప్రయోగాత్మకంగా చేపట్టిది. త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయనుంది.
OYOకు వెళ్తే.. ఆధారాలు ఉండాల్సిందే..
ట్రావెల్ బుకింగ్ దిగ్గజం OYO సంస్థ తమ భాగస్వామ్య హోటళ్ల కోసం కొత్త చెక్-ఇన్ విధానాన్ని ప్రారంభించింది. ఇది మొదటగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అమల్లోకి వచ్చింది. పెళ్లి కాని జంటలు హోటల్‌కు వెళ్తే ఇక నుంచి రూములు ఇవ్వరు. పెళ్లయిన వారు బుక్ చేసుకోవాలంటే అందుకు ఆధారాలు చూపించారు. అప్పుడే అనుమతినిస్తారు. జంటలు చెక్-ఇన్ సమయంలో తమ వైవాహిక సంబంధాన్ని రుజువు చేసే ఆధారాలను సమర్పించాల్సి ఉ...


