Kancha Gachibowli issue | కంచ గచ్చిబౌలి భూ వివాదంలో కీలక మలుపు..
Kancha Gachibowli issue : హైదరాబాద్ నగరంలో కంచ గచ్చిబౌలి భూ వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టు దృష్టిలోకి వెళ్లింది. ఈ భూములపై జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున పర్యావరణ నష్టం జరుగుతోందని పలు సంస్థలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపపథ్యంలో మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC)ని నియమించింది. కంచ గచ్చిబౌలి స్థలాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
Kancha Gachibowli issue : అధికారులతో సీఈసీ సభ్యుల భేటీ
సుప్రీం కోర్టు నియమించిన సీఈసీ సభ్యులు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ కమిటీకి సిద్దాంత్ దాస్ అధ్యక్షత వహిస్తుండగా ఇతర సభ్యులుగా CP గోయల్, సునీల్ లిమయే, JR భట్ ఉన్నారు. వీరు గురువారం ఉదయం నుంచి హైదరాబాద్ విశ్వవిద్యాలయం సమీపంలోని 400 ఎకరాల భూమిని ప్రత్యక్షంగా పరిశీలన (Supreme ...

