Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి
Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. మంగళవారం ఉగ్రవాద దాడిలో కనీసం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది గాయపడినట్లు సమాచారం. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లు అడిగి చంపారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఉగ్రవాద సంస్థ టిఆర్‌ఎఫ్ ప్రకటించింది.
ఇద్దరు విదేశీయులు కూడా..
ఉగ్రవాద దాడిలో ఇద్దరు విదేశీయులు కూడా మరణించారని తెలిసింది. నిరాయుధులైన ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన తర్వాత, ఉగ్రవాదులు దట్టమైన అడవి వైపు పారిపోయారు. కేంద్ర సంస్థల వర్గాల సమాచారం ప్రకారం, ఈ దాడికి ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు పాల్పడ్డారు. అయితే, భద్రతా సిబ్బంది మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
Pahalgam Terror Attack పై NIA దర్యాప్తు
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి...




