Fahad Fazil | పూరీ మూవీలో ఫహద్ ఫాసిల్ ..?
                    Fahad Fazil Next Movie : టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ (Puri Jagannath) వరుస ఫ్లాఫ్ లతో సతమతమవుతున్నాడు. ఒకప్పుడు హీరోలతో మాస్ డైలాగు లు చెప్పించి హిట్స్ అందించిన ఈ డైరెక్టర్ కి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుంది. పూరితో సినిమా అంటే స్టార్ హీరోలందరూ ఎదురుచూసేవారు. వరుసగా బ్లాక్బస్టర్లు కొడుతూ టాలీవుడ్ ని షేక్ చేసిన పూరీ తక్కువ రోజుల్లోనే సినిమా కంప్లీట్ చేసే డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.
బిజినెస్ మాన్ మూవీని మహేష్ బాబు (mahesh babu) లాంటి స్టార్ హీరోతో 70 రోజుల్లో కంప్లీట్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ డైరెక్టర్ మునుపటి ఫామ్ ను అందుకోలేకపోతున్నాడు. బిజినెస్ మెన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli)పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాలని ఉందని కోరాడంటే ఆ టైంలో పూరీ హవా అలా ఉండేది.
జెట్ స్పీడ్ తో సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టడం అంటే మా...                
                
             
								



