ACB Raids | ఏసీబీ వలలో ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్
ACB Raids | భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ అరుణను ఏసీబీ అధికారులు వలవేసి రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.2వేల గజాలు తన కొడుకు పేరు మీద గిఫ్ట్ డీడ్ కోసం సబ్ రిజిస్టర్ అరుణ ను ఆశ్రయించాడు. ఇందుకోసం సదరు సబ్ రిజిస్ట్రార్ రూ. 50వేలు డిమాండ్ చేసింది. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాకుమెంట్స్ రైటర్ పి.వెంకటేశ్వర రావు ద్వారా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం రూ.30 వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.
ఇందులో భాగంగా సోమవారం రిజిస్ట్రేషన్ చేసేందుకు డాకుమెంట్స్ రైటర్ వెంకటేశ్వర రావు ద్వారా రూ.30 వేలు ఇస్తుండగా గా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు (ACB Raids) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత 9 నెలల క్రితమే స...


