ACB : రూ.12 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ.. చివరకు..
                    ACB | రాష్ట్రవ్యాప్తంగా అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. ప్రజలను లంచాలతో పీడిస్తున్న అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం ఇస్తే చాలు ఇట్టే వాలిపోతున్నారు ఏసీబీ అధికారులు.. పక్కాగా వల పన్ని లంచావతారులను అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మే29న లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఇబ్రంహీంపట్నం మండలం ఆర్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
పట్టాదారు పాసు పుస్తకంలో స్థలాన్ని నమోదు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) ను ఏసీబీ అధికారులు (ACB Officials) అరెస్టు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బుధవారం చోటుచేసుకుంది. సర్వే నంబర్ 355లో ఏడు గుంటల భూమిని నమోదు చేసేందుకు ఆర్‌ఐ కృష్ణ ఏకంగా రూ.12లక్షల లంచం ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు చివరకు రూ.9 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్...                
                
             
								



