Medigadda Incident | మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరిలో ఆరుగురు యువకుల గల్లంతు
Medigadda Incident | జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో శనివారం రాత్రి వేళ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహదేవపూర్ మండలం అంబటిపల్లి సమీపంలో మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. గోదావరిలో శుక్రవారం సాయంత్రం స్నానానికని వెళ్లిన ఆరుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. మొత్తం 10 మంది వెళ్లగా అందులో ఆరుగురు గల్లంతయ్యారు. ఘటనపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే సహయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కాగా నదిలో గల్లంతయినవారిలో అంబటిపల్లికి చెందిన నలుగు యువకులు, కొర్లకుంటకు చెందిన ఇద్దరు యువకులు ఉన్నట్లు సమాచారం. మహాదేవపుర్ ఎస్ఐ పవన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని యువకుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
గల్లంతైన యువకులు ఎవరు?
స్నానానికి వెళ్లిన ...



