Ranjith Reddy | విద్యా సేవలో యువ నాయకుడు..
                    లక్ష్యం 10 వేల మంది పేద విద్యార్థులకు చదువు
నిరుపేద పిల్లలకు చదువును దగ్గర చేస్తున్న యువ నాయకుడు
పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2,500 బ్యాగులను పంపిణీ చేసిన రంజిత్ రెడ్డి
ఇప్పటికే 120 మంది విద్యార్థులకు విద్యాదానం..?   
Hanmakonda :  పేద విద్యార్థులకు చదువును అందించడమే అతని లక్ష్యం. పేదరికంలో మగ్గిపోతూ చదువుకోవడానికి నానా అగచాట్లు పడుతున్న పేద పిల్లలకు నేనున్నానంటూ అక్కున చేర్చుకుంటాడు. ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులకు వారి చదువుకు అయ్యే ఆర్థిక వనరులను సమకూరుస్తూ, వారి కలలను సాకారం చేస్తున్న "రంజిత్ రెడ్డి (Ranjith Reddy) "పై సర్కార్ లైవ్ అందిస్తున్న ప్రత్యేక కథనం..
హన్మకొండ (Hanmakonda) జిల్లా రెడ్డిపురానికి చెందిన రంజిత్ రెడ్డికి చదువుపై మొదటి నుంచి ఎంతో మక్కువ. చదువుకోవాలనే తపన ఉండి, చదువుకు పేదరికం అడ్డుగా ఉన్న ఎంతో మంది విద్యార్థుల చదువుకు అవసరమైన ...                
                
             
								
