Sarkar Live

Day: June 30, 2025

Mee Seva | మీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి మరిన్ని సేవలు
State, Hyderabad

Mee Seva | మీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి మరిన్ని సేవలు

మీ సేవ కేంద్రాల్లో (Mee Seva Centers) మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్, భూముల మార్కెట్ విలువ సర్టిఫికేట్ వంటి సేవలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Minister Duddilla Sridhar babu) సోమవారం అధికారికంగా ప్రారంభించారు. దీనిపై సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన తాజా సేవల తీరును పరిశీలించారు. ఇకపై మ్యారేజీ రిజిస్ట్రేష‌న్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిర‌గాల్సిన అవసరం ఉండదు. ఇకపై దరఖాస్తుదారులు స్లాట్ బుకింగ్ ద్వారా ముందుగానే అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చు. పెళ్లి తాలూకు ఫొటోలు, చిరునామా, వయస్సు రుజువులతో పాటు అవసరమైన పత్రాలు సమర్పిస్తే, ధ్రువీకరణ అనంతరం సర్టిఫికేట్‌ను ప్రత్యక్షంగా ఎస్ఆర్వో కార్యాలయంలో పొందవచ్చు. Mee Seva : భూముల మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్ కూడా.. భూముల తాజా మార్కెట్ విలువ తెలుసుకోవాలంటే ఇక చాలా సులువు. మీ సేవ కేంద్రం (Mee seva ...
Raja Singh | బిజెపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా?
State, Hyderabad

Raja Singh | బిజెపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా?

తెలంగాణ బీజేపీ (Telangana BJP) లో అంత‌ర్గ‌త విభేదాలు మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడి ఎంపిక‌పై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (MLA Raja Singh ) మరోసారి సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కాగా బీజేపీ హైకమాండ్‌ను టార్గెట్‌ చేసి రాజాసింగ్ ప‌లు విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావును అధిష్టానం ఖరారు చేసిన విష‌యం తెలిసిందే.. ఈ విష‌యంపై ​గోషామ‌హ‌ల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ..‘రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంద‌ని, రాష్ట్ర అధ్యక్షుడిని బూత్‌ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటు వేసి ఎన్నుకోవాల‌ని, అంతేకానీ, పార్టీలో మావాడు, మీవాడు అంటూ నియమిస్తుంటే పార్టీకి నష్టం వ‌స్తుంద‌ని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే కచ్చితంగా ఎన్నిక నిర్వహి...
Power Star | వీరమల్లు ట్రైలర్ వచ్చేస్తోంది….
Cinema

Power Star | వీరమల్లు ట్రైలర్ వచ్చేస్తోంది….

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మూవీ హరిహర వీరమల్లు (Harihara Veeramallu). 4 ఏళ్ల క్రితం మొదలైన ఈ మూవీ అన్ని అడ్డంకులను దాటుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది.ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రజెంట్ జెట్ స్పీడ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంటుంది. పవర్ స్టార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీపై ఫాన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించే ధీరుడు… మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించే ఒక యోధుడిగా పవన్ విశ్వరూపాన్ని చూపెట్టబోతున్నట్టు మూవీ టీం చెబుతోంది. రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈ మూవీని మొదట క్రిష్(krish)డైరెక్ట్ చేశాడు.ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.ఆ బాధ్యతలను ప్రొడ్యూసర్ ఎ ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్...
Vedantu college | అనుమతి లేని వేదాంతు..
Special Stories

Vedantu college | అనుమతి లేని వేదాంతు..

మాయమాటలతో బురిడీ కొట్టిస్తూ అడ్మిషన్ల దందా.. అకాడమీ పేరుతో బోర్డు.. అక్రమంగా జూనియర్ కాలేజీ నిర్వహణ మరో కళాశాల నుండి హాల్ టికెట్లు వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాకే అడ్మిషన్లు Hanmkonda | హన్మకొండ జిల్లా కేంద్రంలో అకాడమీల పేరుతో విచ్చలవిడిగా అనుమతి లేకుండా ఇంటర్మీడియట్ కళాశాలలు (Illegal Junior college) పుట్టుకొస్తున్నాయి. అలాంటి జాబితాలోకే వస్తుంది ఈ "వేదాంతు "కాలేజీ.అనుమతి లేకున్నా అడ్మిషన్లు తీసుకుంటూ ఇంటర్మీడియట్ కళాశాల నిర్వహిస్తున్న వేదాంతు (Vedantu college ) యాజమాన్యం, జిల్లాలో తాము కార్పోరేట్ విద్యనందిస్తామని ప్రచారం చేసుకుంటూ అడ్మిషన్ల దందా జోరుగా కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ పేరుతో బోర్డ్ పెట్టిన సదరు యాజమాన్యం విద్యాశాఖ (Education Department) నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ కాలేజి నిర్వహిస్తూ మధ్యతరగతి తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకొని వారిక...
error: Content is protected !!