ACB Raids | లంచావతారులకు ఏసీబీ షాక్… ఆరు నెలల్లో 125 మంది అరెస్టు..
ACB Raids in Telangana | తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) జూన్ - 2025లో 31 కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టింది. వీటిలో 15 ట్రాప్ కేసులు, రెండు ఆదాయానికి మించిన ఆస్తులు (DA) కేసులు, మూడు నేరపూరిత దుష్ప్రవర్తన కేసులు, నాలుగు సాధారణ విచారణలు, ఏడు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయని ఏసీబీ వెల్లడించింది. ఈమేరకు జనవరి నుంచి జూన్ వరకు తన అర్ధ వార్షిక రౌండ్ అప్‌లో ప్రకటించింది.
ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఒక ప్రైవేట్ వ్యక్తితో సహా 25 మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేసి అరెస్టు చేశారు. తర్వాత వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. వివిధ విభాగాల ట్రాప్ కేసుల్లో రూ.3.43 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. రెండు డిఎ కేసులలో, రూ.13.50 లక్షలు, రూ.5.22 కోట్ల విలువైన ఆదాయానికి మించి ఆస్తులు బయటపడ్డాయి. ఆర్టీఏ చెక్ పోస్టులు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో, లెక్కల్లో చూపని రూ.2.72 ల...



