MGM Hospital | ఎంజీఎం ఆస్పత్రిలో మారిన మృతదేహాలు..
                    అంత్యక్రియల సమయంలో బయటపడ్డ నిజం
Warangal MGM Hospital | రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై ఓ వ్యక్తి ఎంజీఎం ఆస్పత్రిలో (MGM Hospital )  చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంధువులు, స్నేహితులు అంతా సదరు వ్యక్తి మృతదేహం చుట్టూ చేరి కన్నీరుమున్నీరయ్యారు. ఈక్రమంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించి దహన సంస్కారాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇక చివరిసారిగా మృతుని ముఖం చూడాలన బంధువులు భావించారు. శవానికి చుట్టిన వస్త్రాన్ని తొలగించి చూడగా అందరూ అవాక్కయ్యారు. ఆ శవం తమ వ్యక్తికి కాదని గుర్తించడంతో అక్కడ కలకలం రేపింది.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి తొర్రూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో అతడిని ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు. మూడు రోజుల పాటు చికిత్స ప...                
                
             
								



