Ragging | ర్యాగింగ్‌పై కఠిన చర్యలు : వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరిక
Warangal News | విద్యాసంస్థల్లో ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ (Ragging) వంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ (Warangal CP) సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. త్వరలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోవుతున్న నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాగింగ్ నియంత్రణపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడడమనేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని, ఈ చర్యల ద్వారా విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేలా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా సీనియర్ల ముసుగులో జూనియర్ విద్యార్థుల పట్ల అసాంఘిక కృత్యాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తూ విద్యాసంస్థల నుంచి తొలగించడంతో పాటు ర్యాగింగ్ లాంటి చర్యలకు పాల్పడే విద్యార్థులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాగింగ్ పా...

