Festive season : పండుగ సీజన్‌కు సిద్ధమవుతున్న దక్షిణ మధ్య రైల్వే, టీజీఎస్ ఆర్టీసీ
                    Hyderabad : సెప్టెంబర్ 19, అక్టోబర్ 28 మధ్య దసరా, దీపావళి, ఛత్ పూజ పండుగ (Festive season )లను పురస్కరించుకొని ప్రయాణీకుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, ప్రయాణీకుల భద్రత, సౌకర్యవంతమైన రవాణా కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.
దీని ప్రకారం, బుధవారం ఎస్‌సిఆర్ అధికారులు, ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి, స్థానిక పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, టిజిఎస్‌ఆర్‌టిసిలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ , చర్లపల్లి, లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీ, స్నాచింగ్, జేబు దొంగతనం, నిషేధిత ప్రాంతాలలోకి అనధికార ప్రవేశాలను అరికట్టడం వంటి ముఖ్యమైన సమస్యలపై సమీక్షించారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, వెయిటింగ్ హాల్స్, సర్క్యులేటింగ్ జోన్లలో రద్దీ పెరగడం, రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, తొక్కిసలాట లాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు ...                
                
             
								


