రియో కార్నివల్ తరహాలో బతుకమ్మ.. అంతర్జాతీయ స్థాయిలో వేడుకలు – Bathukamma festival
Bathukamma festival : బతుకమ్మ పండుగ ను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ (Telangana tourism) ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సెప్టెంబరు 21 నుంచి 30 వరకు జరిగే ఈ తొమ్మిది రోజుల పూల పండుగను ఈసారి మరింత వైభవంగా జరపాలని సంకల్పించింది. ఈ సారి కూడా బతుకమ్మ ఉత్సవం వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి (Thousand Pillar Temple) వద్ద ప్రారంభమవుతుంది. ఈ ప్రదేశం తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. పూలతో అలంకరించిన బతుకమ్మలను మహిళలు పురాతన కట్టడాల మధ్య సమూహంగా ఆడుతూ పాడుతూ జరుపుకోవడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.
కొంగొత్త తరహాలో Bathukamma festival
బతుకమ్మ ఉత్సవాల ((Bathukamma festival)ను ఈ సారి రియో కార్నివల్ తరహాలో నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Tourism minister Jupally Krishna Rao) తెలిపారు. ప్రపంచ పర్యాటక...


