Sarkar Live

Day: October 14, 2025

హర్యానా ఐపీఎస్ అధికారి ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ ఆత్మహత్య
Crime

హర్యానా ఐపీఎస్ అధికారి ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ ఆత్మహత్య

Haryana IPS officer suicide case | హర్యానా పోలీసు అధికారి వై. పురాణ్ కుమార్ మృతి కేసులో ఊహించ‌ని మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు అధికారి రోహ్‌తక్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడిని సందీప్ కుమార్‌గా గుర్తించారు. ఆయన అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఆయన సైబర్ సెల్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.లాధోట్ గ్రామంలోని అతని ఇంటి నుంచి మూడు పేజీల సూసైడ్ నోట్ తోపాటు ఒక వీడియోను స్వాధీనం చేసుకున్నారు. కుమార్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని విశ్వ‌స‌నీయ వర్గాలు తెలిపాయి. ఆ నోట్‌లో, వై. పురాణ్ కుమార్ ఒక "అవినీతి అధికారి" అని, అతనిపై "తగినంత ఆధారాలు" ఉన్నాయని ఆరోపించారు. కుల వివక్ష సమస్యను ఉపయోగించి ఐపీఎస్ అధికారి వ్యవస్థను హైజాక్ చేశారని కూడా ఆయన ఆరోపించారు. "నేను ఎప్పుడూ సత్యం పక్షాన ఉంటాను. స్వాతంత్ర్య పోరాటంలో నా కుటుంబం పాల్గొంది. భగత్ సింగ్‌ను నా ఆదర్శంగా భావ...
Suicide | ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
Crime, State

Suicide | ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

హైదరాబాద్‌ ‌బాలానగర్‌ ‌(Balanagar) ప్రాంతంలో విషాదక‌ర‌ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, ఆ తర్వాత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మృతురాలిని చల్లారి సాయిలక్ష్మీ (27)గా గుర్తించారు. ఆమె భర్త అనిల్‌ ‌కుమార్‌ ‌తో కలిసి పద్మారావు నగర్‌ ‌ఫేజ్‌-1, ‌బాలానగర్‌ ‌లో నివాసముంటోంది. సాయిలక్ష్మీకి ఇద్దరు కవల పిల్లలు చేతన్‌ ‌కార్తికేయ, లాస్యతవల్లి ఉన్నారు. అయితే స్థానికుల క‌థ‌నం మేర‌కు కొంతకాలంగా భర్తతో విభేదాలు, వ్యక్తిగత సమస్యల కార‌ణంగా తీవ్ర మనస్థాపానికి గురైన సాయిలక్ష్మీ, క్ష‌ణికావేశంతో తన ఇద్దరు పిల్లలను చంపి అనంతరం భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మ‌రో ఘ‌ట‌న‌లోకొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీ మండలంలోని గంభీరావుపేట గ్రామానికి చెందిన సైదం కల్పన(...
హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం – తెలంగాణకు కేంద్రం భారీ కేటాయింపులు – Telangana Highways
State, Hyderabad

హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం – తెలంగాణకు కేంద్రం భారీ కేటాయింపులు – Telangana Highways

Telangana Highways | రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను హ్యామ్ (HAM )విధానంలో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమితిచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.25,661 కోట్ల నిధులను జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 431 కిలోమీటర్ల మేర రహదారులను హ్యామ్ పద్దతిలో నిర్మించేందుకు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించారు. ఈ రహదారులను కేంద్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థలు 40:60 నిష్పత్తిలో నిధులు ఖ‌ర్చును పంచుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంవ‌త్స‌రం జాతీయ స్థాయిలో 124 జాతీయ రహదారులను నిర్మించాల‌ని ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. రూ.3,45,466 కోట్లతో 6,376 కిలోమీటర్ల మేర ర‌హ‌దారులు నిర్మించ‌నున్నారు. రూ.500 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసి చేపట్టే ఈ రహదారుల నిర్మాణాల తాత్కాలిక జాబితాలో రాష్ట్రానికి చెందిన ఐదు జాతీయ రహదారులకు చోటు దక్కడం విశేషం. Telangana Highways : రాష్ట్రానికి లభించిన ప్రధాన ప్రాజెక్టుల...
error: Content is protected !!