Sarkar Live

Day: October 25, 2025

ACB Raid | రూ.2 లక్షల లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన కోపరేటివ్‌ జిల్లా అధికారి
Crime, Adilabad

ACB Raid | రూ.2 లక్షల లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన కోపరేటివ్‌ జిల్లా అధికారి

ACB Raid in Mancherial | మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు(ACB Raid) చేసి ఓ అవినీతి తిమింగ‌ళాన్ని ప‌క్కా ప్లాన్‌తో ప‌ట్టుకున్నారు.. శనివారం మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు నాయక్ పట్టణంలోని తన నివాసం వద్ద రూ.2 లక్షల లంచం(Bribe) తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు చిక్కాడు. ఏసీబీ ఆదిలాబాద్ ఏఎస్పీ మధు( ASP Madhu ) క‌థ‌నం ప్రకారం.. ఆసిఫాబాద్ సహకార జిల్లా ఇన్‌చార్జి అధికారిగా పని చేస్తున్న సమయంలో అక్కడ పని చేస్తున్న ఓ ఉద్యోగి గతేడాది నవంబరులో సస్పెన్ష‌న్‌కు గుర‌య్యాడు. అయితే సదరు ఉద్యోగికి సంబంధించి పెరిగిన వేతనాలు మంజూరు, సస్పెండ్ ఎత్తివేయడం కోసం ఏకంగా రూ.7 లక్షలను లంచంగా డిమాండ్ చేశాడు.ఇందులో భాగంగా మొదటి విడతగా రూ. 2 లక్షల ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు శనివారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ కార్యాలయంలోని ...
Warangal | ప్ర‌మాదం జ‌రిగితే గానీ స్పందించ‌రా?
State, warangal

Warangal | ప్ర‌మాదం జ‌రిగితే గానీ స్పందించ‌రా?

నెలలుగా రహదారి మరమ్మతులు లేక తీవ్ర ఇబ్బందులు స్కూల్ బస్సులు, భారీ వాహనాలు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం Warangal | వ‌రంగ‌ల్ 15వ డివిజ‌న్ ప‌రిధిలోని ప్ర‌గ‌తి ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియా (Pragathi Industrial Area) నుంచి రెడ్డిపాలెం (Reddypalem) వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంస‌మై నెల‌లు గ‌డుస్తున్నా ప‌ట్టించుకున్న నాథుడే క‌రువ‌య్యారు. లోతైన గుంత‌లు ప‌డి రాళ్లు బుర‌ద‌తో నిండిపోయి ఉండ‌డంతో ఎప్పుడు ఏ ప్ర‌మాదం జ‌రుగుతుందోన‌ని స్థానికులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే ఇదే రోడ్డు నుంచి రెండు ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు చెందిన సుమారు 25 స్కూల్ బ‌స్సులు విద్యార్థుల‌తో నిత్యం రాక‌పోక‌లు సాగిస్తుంటాయి. కీర్తిన‌గ‌ర్, గొర్రెకుంట, లేబ‌ర్ కాల‌నీ ప్రాంతాల నుంచి ప‌లువురు త‌మ పిల్ల‌ల‌ను ద్విచ‌క్ర‌వాహనాల‌పై పిల్ల‌ల‌ను ఇదే రోడ్డు మీదుగా తీసుకెళ్తుంటారు. భారీ వాహ‌నాల‌తో నిత్యం రద్దీ.. అలాగే ప‌త్తి, మిర్చి, ఇత‌ర వ్య‌...
error: Content is protected !!