Sarkar Live

Day: November 5, 2025

కార్తీక పౌర్ణమి వేడుకలు.. శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ – Karthika Pournami 2025
LifeStyle

కార్తీక పౌర్ణమి వేడుకలు.. శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ – Karthika Pournami 2025

Karthika Pournami 2025 | కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వరంగల్‌ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, భ‌ద్ర‌కాళి ఆల‌యం, వ‌రంగ‌ల్‌లోని క‌ట్ట‌మ‌ల్ల‌న్న‌దేవాల‌యం, కోటిలింగాల దేవాల‌యం, ఐన‌వోలు మ‌ల్లికార్జున‌స్వామి దేవాల‌యం, ములుగు జిల్లా రామప్ప, భూపాల‌ప‌ల్లి జిల్లా కాళేశ్వరం, హ‌నుమ‌కొండ‌లోని సిద్దేశ్వరాలయం, కోటగుళ్లు, పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో భ‌క్తులు పోటెత్తారు. మ‌హ‌దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ త‌మ మొక్కులు తీర్చుకుంటున్నారు. పుణ్యస్నానాలు, దీపోత్సవాలు కార్తీక పౌర్ణ‌మిని పుర‌స్క‌రించుకొని కాళేశ్వరం వ‌ద్ద గోదావ‌రి త్రివేణి సంగమంలో పెద్ద సంఖ్య‌లో మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే భద్రాచలం వద్ద గోదావరి ఘాట్‌ల వద్ద భక్తులు స్నానాలు చేసి, ఆలయంలో కార్తీ...
Holiday | నేడు పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులు మూసివేత
LifeStyle

Holiday | నేడు పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులు మూసివేత

November 5 Holiday in Telangana | అనేక రాష్ట్రాల్లో బుధవారం నవంబర్ 5, 2025న పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. నవంబర్ 5న గురునానక్ జయంతి, ప్రభుత్వ సెలవుదినం. దీని కోసం ప్రభుత్వం గెజిటెడ్ సెలవు ప్రకటించింది. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవుపై అయోమ‌యానికి గుర‌వుతున్నారు.సెలవు ఉంటుందని కొందరు, లేదని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. కాగా, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5న తెలంగాణలో అధికారిక సెలవు ప్ర‌క‌టించారు. ఈ మేరకు ప్రభుత్వ హాలిడే క్యాలెండర్ లో సెలవు దినంగా పేర్కొన‌బ‌డి ఉంది. కార్తీక పౌర్ణమితో పాటు సిక్కుల మతగురువు గురునానక్ జయంతి కూడా నవంబర్ 5నే. ఇలా హిందువులు, సిక్కులకు ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి రేపు (బుధవారం) పూర్తిస్థాయిలో సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఏపీలో ఉంటుందా? ఆంధ...
error: Content is protected !!