Telangana : మధ్యాహ్న భోజనానికి నిధుల విడుదల- ఏయే జిల్లాకు ఎంతెంత ?
తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న I నుంచి VIII తరగతుల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన (Midday meal scheme ) పథకం కోసం ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు విడుదల (Funds Releases) చేసింది. కొన్ని నెలలుగా ఈ పథకానికి సంబంధించిన వంట ఖర్చులు (cooking expenses), కుకింగ్ హెల్పర్స్ (community cooking helpers)కు ఇచ్చే చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం రూ. 44.91 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాఠశాలలలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విడుదలైన నిధులు ఇలా..
ప్రభుత్వం విడుదల చేసిన మొత్తంలో వంట ఖర్చు కోసం రూ. 34.91 కోట్లు, కమ్యూనిటీ కుకింగ్ హెల్పర్స్‌కు రూ.10 కోట్లు విడుదల చేసింది. సహాయకులైన హెల్పర్స్‌కు, సెప్టెంబరు నెలలకు కలిపి రూ.1,000 చొప్పున చెల్లించాల్సి ఉంది.ప్రభుత్వం విడుదల...


