సీతక్కపై విమర్శలు చేస్తే సహించేది లేదు: మాజీ రెడ్కో చైర్మన్‌పై రేగ కళ్యాణి నిప్పులు
ములుగు: తెలంగాణ రాష్ట్ర మాజీ రెడ్కో చైర్మన్ ఏరువా అలియాస్ గుంటూరు సతీష్ రెడ్డి తీరుపై ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సతీష్ రెడ్డికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసం మంత్రి సీతక్కపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
100 కోట్ల ఖర్చుకు 200 కోట్ల స్కాం ఎలా సాధ్యం?
మేడారం ఆలయ ప్రాంగణ నిర్మాణానికి సంబంధించి సతీష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను రేగ కళ్యాణి తిప్పికొట్టారు. "మేడారం గుడి ప్రాంగణ నిర్మాణానికే వంద కోట్లు ఖర్చు అయితే.. అందులో 200 కోట్ల స్కాం జరిగిందని చెప్పడం నీ అవివేకానికి నిదర్శనం. అద్దాల మేడల్లో ఉంటూ ప్రకటనలు ఇచ్చే నీకు క్షేత్రస్థాయి పరిస్థితులు ఏం తెలుసు?" అని ప్రశ్నించారు. మేడారం జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఘనత సీతక్కకే దక్కుతుందని ఆమె స్పష...


