సొంత ప్రభుత్వంపై విజయశాంతి అసహనం: “ఉద్యమకారులకు ఇచ్చిన హామీల సంగతేంది?”
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన ప్రధాన వాగ్దానాలు అమలు కాకపోవడాన్ని ఆమె శాసన మండలి వేదికగా నిలదీశారు.
అమలుకు నోచుకోని ప్రధాన హామీలు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ విజయశాంతి పలు అంశాలను ప్రస్తావించారు.ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇళ్ల స్థలం మరియు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం,నెలకు రూ. 4,000 పెన్షన్ పంపిణీ,ఆరోగ్యం & ఉపాధి: రూ. 10 లక్షల ఆరోగ్య బీమాతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం తదితర హామీలను ప్రస్తావించారు."ప్రభుత్వం అనేక కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది, అది శుభపరిణామమే. కానీ, రాష్ట్రం ...




