రైతు వ్యతిరేక విధానాలపై యువజన కాంగ్రెస్ సమరభేరి: వరంగల్‌లో ‘కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్ష’ ప్రారంభం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ‘కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్ష’ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, రోషిని ఆదేశాలతో
వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దిలీప్ రాజ్ నేతృత్వంలో వరంగల్ పోచంమైదాన్ సెంటర్ లో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.దేశవ్యాప్తంగా రైతులను నష్టపరిచే విధంగా మోడీ సర్కారు నిర్ణయాలు తీసుకుంటోందని వారు ఆరోపించారు.
రైతులకు న్యాయం జరిగే వరకు, వారి హక్కులను కాపాడే వరకు కాంగ్రెస్ పార్టీ మరియు యువజన విభాగం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా రైతుల గొంతును ప్రభుత్వానికి వినిపిస్తామని...



