ఏసీబీ, టాస్క్ ఫోర్స్ నజర్ వేసేనా?
బయటపడితే పదుల సంఖ్యలో అధికారులు అవుట్!
ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు.. తలలు పట్టుకున్న తహశీల్దార్ లు
తమ పేర్లు ఎక్కడ బయటకొస్తాయోనని టెన్షన్ లో అధికారులుఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖలో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది. ఆ పేరే "శేఖర్". వ్యవస్థను తన కబంధ హస్తాల్లో ఉంచుకుని, చట్టాన్ని చుట్టంలా మార్చుకున్న ఈ 'బారాణ బ్రోకర్' (Revenue Broker) లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడుతోంది. శేఖరుడి వెనుక ఉన్న ఆ అదృశ్య హస్తాలెవరివి? రెవెన్యూ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న ఈ చక్రవర్తి కథాకమీమామిషు ఏంటి?
బ్యాంకు లావాదేవీలు బయటపడితే.. వికెట్లు పడాల్సిందే!
శేఖరుడి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లపై నిఘా పెడితే సంచలన నిజాలు బయటకు వస్తాయనే చర్చ జోరుగా సాగుతోంది.గత కొన్ని సంవత్సరాలుగా తహశీల్దార్ ల బినామీలకు, కొంత మంది రెవెన్యూ ఉద్యోగులకు ఈ దళారీ అకౌం...

