Sarkar Live

Day: April 13, 2026

తోటి (PVTG) తెగ సమస్యల పరిష్కారానికి వినతి: అధికారుల సానుకూల స్పందన
State, Hyderabad

తోటి (PVTG) తెగ సమస్యల పరిష్కారానికి వినతి: అధికారుల సానుకూల స్పందన

తెలంగాణలోని మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసి తోటి (PVTG) తెగ ప్రజల చిరకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 'తెలంగాణ ఆదివాసి తోటి PVTG సేవా సంఘం' నేతలు మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర రెడ్డిని కలిశారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో విస్తరించి ఉన్న తమ తెగ సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ​ప్రధాన డిమాండ్లు.. ​రేషన్ కార్డులు: ఏజెన్సీ ప్రాంతాల్లో లాగే మైదాన ప్రాంత తోటి కుటుంబాలకూ 30 కిలోల బియ్యం వచ్చేలా అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలి. ​ఉపాధి & విద్య: ట్రైకార్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయాలని కోరారు. ​సాంస్కృతిక రక్షణ: తోటి తెగ విశిష్ట వాయిద్యాలైన బుర్ర - మద్దెలను ట్రైబల్ మ్యూజియంలో ప్రదర్శించాలి. ​కుల ధ్రువీకరణ: కరీంనగర్ జిల్లాలో 'రా...
కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. కీర్తినగర్ భూములపై ‘డిజిటల్’ సర్వే!
Special Stories

కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. కీర్తినగర్ భూములపై ‘డిజిటల్’ సర్వే!

Keerthinagar Land Digital Survey | ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో వరంగల్ జిల్లా కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. కీర్తినగర్ హౌజింగ్ బోర్డు భూములపై "సర్కార్ లైవ్" లో వెలువడిన కథనాలకు స్పందించిన కలెక్టర్, తక్షణమే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు మంగళవారం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి (AD) ఆధ్వర్యంలో రెవెన్యూ బృందం భూముల సర్వే నిర్వహించింది. ​సర్కార్ లైవ్ కథనానికి స్పందన ​మంగళవారం సర్కార్ లైవ్ లో "కలెక్టర్ జోక్యం చేసుకుంటేనే ప్రభుత్వ భూమి దక్కేది" అనే శీర్షికతో వెలువడిన వార్త జిల్లా యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. కీర్తినగర్ పరిధిలోని హౌజింగ్ బోర్డు భూములు ఆక్రమణకు గురవుతున్నాయనే ఫిర్యాదులను,వార్తా కథనాలను కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నారు. సర్వే ద్వారా వాస్తవాలను వెలికితీయాలని ఆదేశించడంతో అధికారులు హుటాహుటిన క్షేత్రస్థాయికి చేరుకున్నారు. ...
కలెక్టర్ జోక్యం చేసుకుంటేనే సర్కారు భూమి దక్కేది! – Land Encroachment
Special Stories

కలెక్టర్ జోక్యం చేసుకుంటేనే సర్కారు భూమి దక్కేది! – Land Encroachment

కనుమరుగవుతున్న హౌజింగ్ బోర్డు భూమి.. సర్వే నంబర్ 561లో అన్యాక్రాంతం ​హన్మకొండలోని ఓ ప్రముఖ హోటల్ కేంద్రంగా రాజకీయ నేతలు, రియల్ మాఫియా, అధికారులు కుమ్మక్కైనట్లు ఆరోపణలు. ​బుట్టదాఖలైన వరంగల్ ఆర్డీవో ఆదేశాలు ​​కలెక్టర్ జోక్యo చేసుకుని సర్వే చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ Gorrekunta Housing Board Land Encroachment | ప్రభుత్వ ఆస్తి కళ్లముందే కరిగిపోతోంది.. రక్షణగా ఉండాల్సిన యంత్రాంగమే మౌనముద్ర దాల్చింది. గీసుగొండ మండలం గొర్రెకుంట శివారులోని సర్వే నంబర్ 561 చుట్టూ ఇప్పుడు భారీ రాజకీయ చదరంగం నడుస్తోంది. అదృశ్య శక్తుల ఒత్తిడి, అధికారుల ఉదాసీనత వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు కీర్తినగర్ వాసుల్లో చర్చనీయాంశమైంది. ​అశోక హోటల్ కేంద్రంగా 'చక్రం'! ​హన్మకొండలోని ఓ ప్రముఖ హోటల్ ఇప్పుడు అక్రమ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హౌజింగ్ బోర్డు భ...
Sada Binama | సాదాబైనామాకు కొత్త‌ నిబంధనలు.. రైతుల‌కు భారీ ఊర‌ట‌
State

Sada Binama | సాదాబైనామాకు కొత్త‌ నిబంధనలు.. రైతుల‌కు భారీ ఊర‌ట‌

నిబంధనల సవరణతో 9 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమం.. రంగంలోకి ఆర్డీవోలు! Sada Binama Land Regularization : తెలంగాణలో సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గతంలో దరఖాస్తుల తిరస్కరణకు ప్రధాన కారణమైన ‘విక్రయదారుడి అఫిడవిట్’ నిబంధనను సవరించడంతో ఇప్పుడు లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి రైతుల భూములకు పట్టా హక్కులు లభించనున్నాయి. ఏమిటీ వివాదం? ఎందుకు తిరస్కరించారు? 2020లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది రైతులు సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 2025లో ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక నిబంధన ఈ ప్రక్రియకు అడ్డంకిగా మారింది. భూమిని అమ్మిన వారు (Seller), కొన్నవారు (Buyer) ఇద్దరూ కలిసి అఫిడవిట్ సమర్పించాలని అధికారులు నిబంధన పెట్టారు. సమస్య: 2014 కంటే ముందు జరిగిన భూ లావాదేవీలకు సంబంధించి.. ఇప్...
మరో సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్
warangal

మరో సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్

వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం (RO) లో అవినీతి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇటీవలే జాయింట్-2 సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ సస్పెండ్ కాగా, తాజాగా జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ రాంనర్సింహారావుపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ​ఈ నెల 3వ తేదీన ఏసీబీ అధికారులు వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై మెరుపు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో వెలుగుచూసిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిన డీఐజీ సుభాషిణి, రాంనర్సింహారావుపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా కమిషనర్ రాజీవ్ గాంధీ హన్మంతు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.వాస్తవానికి ఈ నెల 10వ తేదీనే సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి.కానీ శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నేడు సోమవారం కార్యాలయం పునఃప్రారంభం కావడంతో, సస్పెన్షన్ కాపీలు అధికారికంగా కార్యాలయానికి చేరనున్నాయి. ​వరుసగా ఇద్దరు...
error: Content is protected !!