నిరుద్యోగుల ఆశలపై ‘ఔట్ సోర్సింగ్’ డేగ కన్ను కోట్లు కొల్లగొట్టేందుకు ఏజెన్సీల స్కెచ్! – Outsourcing Jobs Scam
Outsourcing Jobs Scam | రాష్ట్రంలో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఏజెన్సీలకు సంబంధించి అధికారిక ప్రొసీడింగ్స్ వెలువడక ముందే, తెరవెనుక దందా మొదలైనట్లు తెలుస్తోంది.మరీ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ లోని హన్మకొండ, వరంగల్, మహబూబాద్,ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వీరి దందా జోరుగా సాగించేందుకు ఇప్పటికే కసరత్తు చేసినట్లు ఓ ఏజెన్సీ నిర్వాహకుడు "సర్కార్ లైవ్" ప్రతినిధితో అన్నారు.
పది రోజుల్లో ప్రొసీడింగ్స్.. వెనువెంటనే నియామకాలు
రాష్ట్రంలోని పలు కీలక శాఖల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. మరో పది రోజుల్లో ఎంపిక చేసిన...


