Sarkar Live

Day: April 22, 2026

తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీజీలుగా పదోన్నతి
Crime

తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీజీలుగా పదోన్నతి

తెలంగాణ పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు చోటుచేసుకున్నాయి. ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ (డీజీ) హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన అధికారులకు ఈ పదోన్నతులు లభించాయి.డీజీలుగా ప్రమోషన్ అందుకున్న వారిలో వీవీ శ్రీనివాసరావు, మహేష్ భగవత్, వీసీ సజ్జనార్, స్వాతి లక్రా, చారు సిన్హా, అనిల్ కుమార్  ఉన్నారు....
టికెట్ రాకున్నా చెదరని నిబద్ధత.. పరకాలలో ‘సైలెంట్’ వెపన్! – Nagurla Venkateshwarlu
State

టికెట్ రాకున్నా చెదరని నిబద్ధత.. పరకాలలో ‘సైలెంట్’ వెపన్! – Nagurla Venkateshwarlu

కేసీఆర్ మాటే శాసనం..ఉద్యమ నేతపై 'పరకాల'లో ఆసక్తికర చర్చ! ​ రాజకీయాల్లో పదవుల కంటే నమ్మకానికి, వ్యక్తిత్వానికే విలువ ఇస్తూ, ఉద్యమ కాలం నుండి నేటి వరకు గులాబీ జెండాను వీడని నిఖార్సయిన నాయకుడు నాగుర్ల వెంకటేశ్వర్లు (Nagurla Venkateshwarlu). వృత్తిరీత్యా పెస్టిసైడ్స్ & ఫర్టిలైజర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడి స్థాయి నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన ఆయన, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ​రైతు బాంధవుడిగా గుర్తింపు ​గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్‌గా నాగుర్ల వెంకటేశ్వర్లు అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. రైతుల కష్టాలను దగ్గరుండి చూసిన వ్యక్తిగా, రైతు సంక్షేమం కోసం ఆయన విశేష కృషి చేశారు. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. వివరాలుసమాచారంనాయకుడి పేరునాగుర్ల వెంకటేశ్వర్లునియోజకవర...
కీర్తినగర్ హౌజింగ్ బోర్డు భూములకు ‘గ్రహణం’.. కలెక్టర్ ఆదేశించినా కదలని సర్వే! – Housing Board Lands
Special Stories

కీర్తినగర్ హౌజింగ్ బోర్డు భూములకు ‘గ్రహణం’.. కలెక్టర్ ఆదేశించినా కదలని సర్వే! – Housing Board Lands

Keerthinagar Housing Board Lands | ​వరంగల్ నగరంలోని కీర్తినగర్ హౌజింగ్ బోర్డు భూములు ఇప్పుడు ఆక్రమణదారుల గుప్పిట్లోకి వెళ్తున్నాయి. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సత్య శారద స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం "అడవిలో వెన్నెల" చందంగా మారింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం, హౌజింగ్ బోర్డు అధికారుల మధ్య సమన్వయ లోపం ఆక్రమణదారులకు వరంగా మారుతోంది.హౌజింగ్ బోర్డు భూముల అన్యాక్రాంతం పై "సర్కార్ లైవ్ "వరుస కథనాలకు స్పందించిన కలెక్టర్ తక్షణమే సర్వే పూర్తి చేసి హౌజింగ్ బోర్డు భూములకు హద్దులు నిర్ణయించాలని ఆదేశించగా సదరు భూములపై సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి ఈ నెల 13 వ తేదీన సర్వే పేరుతో హడావుడి చేసి చేతులు దులుపుకొన్నారు ​వివాదానికి ప్రధాన కారణాలు ​రికార్డుల సాకు: భూ సేకరణకు సంబంధించిన పూర్తి రికార్డులు ఇస్తే...
error: Content is protected !!