ఓరుగల్లు ఖ్యాతిని ప్రపంచానికి చాటనున్న ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్’.. – Kakatiya Mega Textile Park
ఈ నెల 10న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
Kakatiya Mega Textile Park | తెలంగాణ వస్త్ర పరిశ్రమకు కొత్త ఊపిరిని, వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్న ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్’ (కేఎంటీపీ) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని శాయంపేట వద్ద 1,327 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్టును, ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు.
ప్రపంచస్థాయి సదుపాయాలతో.. 'పీఎం మిత్ర'లో చోటు
2017లో శంకుస్థాపన జరిగి, ప్రారంభ దశలో నెమ్మదిగా సాగిన ఈ పార్కు పనులు, కేంద్ర ప్రభుత్వ ‘పీఎం మిత్ర’ (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పారెల్) పథకంలో బ్రౌన్ ఫీల్డ్ ప్రాజె...


