Sarkar Live

Day: May 9, 2026

ముగిసిన రాజకీయ అనిశ్చితి: రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం !
National

ముగిసిన రాజకీయ అనిశ్చితి: రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం !

Tamil Nadu Politics | తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టీవీకే (TVK) అధినేత విజయ్, శనివారం నాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అరేల్కర్‌ను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో, ఆదివారం ఉదయం 10 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కూడగట్టిన మెజారిటీ: 120కి చేరిన బలం 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో సాధారణ మెజారిటీ మార్కు 118. తొలుత 108 సీట్లతో మెజారిటీకి 10 సీట్ల దూరంలో ఉన్న టీవీకేకు మిత్రపక్షాల మద్దతు లభించడంతో బలం 120కి పెరిగింది: టీవీకే: 107 సీట్లు (విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయడంతో 108 నుంచి 107కి తగ్గింది). మద్దతు ఇస్తున్న పార్టీలు: కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఐ(ఎం) (2), వీసీకే (2), ఐయూఎంఎల్ (2). వీసీకే మరియు ఐయూఎంఎల్ పార్టీలు బేషరత...
ధాన్యం మళ్లింపుపై దర్యాప్తు జరగాల్సిందే: హైకోర్టు కీలక తీర్పు
Hyderabad

ధాన్యం మళ్లింపుపై దర్యాప్తు జరగాల్సిందే: హైకోర్టు కీలక తీర్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ధాన్యం మళ్లింపు వ్యవహారంపై దర్యాప్తు కొనసాగాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మిల్లర్లపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయడానికి నిరాకరిస్తూ, వారి పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ​ప్రధానాంశాలు.. ​కేసు నేపథ్యం: 2022-23 కాలంలో మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు సొంత ప్రయోజనాల కోసం మళ్లించారని, ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా రూ. 3,960 కోట్ల మేర బకాయి పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ​మిల్లర్ల వాదన: ధాన్యం నాణ్యత సరిగా లేదని, ప్రభుత్వం మిల్లింగ్ ఛార్జీలు, గన్నీ బ్యాగుల ఖర్చులు చెల్లించలేదని, అందుకే తాము బాధ్యులం కాదంటూ సుమారు 360 మంది మిల్లర్లు 58 పిటిషన్లు దాఖలు చేశారు. ​ప్రభుత్వ వాదన: మిల్లర్లు ధాన్యాన్ని అమ్ముకుని ఆ సొమ్మును సినిమా రంగం, ఇతర స్థిర, చరాస్తుల్లో పెట్టుబడులుగా పెట్టారని అడ్వకేట్ జనరల్ వాదించారు. ​కోర్టు వ్యాఖ్య...
కోట్లకు పడగలెత్తిన సర్వేయర్
Special Stories

కోట్లకు పడగలెత్తిన సర్వేయర్

​టెక్స్‌టైల్ పార్క్ కేంద్రంగా కోట్ల దందా.. ప్రభుత్వ సర్వేయర్ ‘గాలి’ వేగం! సదా.. ఆనందంగా అక్రమాల పర్వం రియల్టర్ అవతారమెత్తిన ప్రభుత్వ సర్వేయర్ ఏసీబీ నజర్ వేస్తే విస్తుపోయే అక్రమాస్తులు వెలుగులోకి ​Warangal Textile Park Surveyor Scam | అతను ఒక ప్రభుత్వ సర్వేయర్. భూముల హద్దులు నిర్ణయించడమే అతని విధి. కానీ, ఆ హద్దులు దాటి అక్రమ సంపాదనలో ‘కోట్లకు పడగలెత్తాడు’. ప్రభుత్వ ఉద్యోగి ముసుగులో రియల్టర్ అవతారమెత్తి, సామాన్యుల భూములతో చెలగాటమాడుతూ అపర కుబేరుడిగా అవతరించాడు. వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఈ 'రియల్' సర్వేయర్ లీలలు హాట్ టాపిక్‌గా మారాయి. ​టెక్స్‌టైల్ పార్క్.. అక్రమాలకు కేరాఫ్ అడ్రస్! ​మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటును ఆసరాగా చేసుకున్న ఈ సర్వేయర్, అక్కడ తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని 'గాలి'లా విస్తరించాడు. ప్రభుత్వ సమాచారం ముందే తెలుసుకుంటూ, అమాయక రైతులను బురిడీ కొట్టిస్తూ భూదంద...
error: Content is protected !!