ACB Target | అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కేనా?
గత ప్రభుత్వంలో కోట్లు కొల్లగొట్టిన సీనియర్ ఎంవీఐ
మూడేళ్ళ క్రితం వరకు ట్రాన్స్‌ఫర్స్.. ఓడీలు.. అన్నీ 'D' అడ్రస్సే!
రవాణా శాఖలో అతనో సామాన్య మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్.కానీ, అతని పరపతి చూస్తే పెద్ద పెద్ద అధికారులే నోరెళ్లబెట్టాలి. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పి, యూనియన్ ముసుగులో అడ్డగోలు దోపిడీకి తెరలేపిన ఒక సీనియర్ ఎంవీఐ (MVI) నిర్వాకం ఇప్పుడు రవాణా శాఖలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో ఆర్‌టీఓ (RTO)గా ప్రమోషన్ పొందేందుకు పావులు కదుపుతున్న ఈ 'మహానుభావుడి' అవినీతి చిట్టా ఇప్పుడు బయటపడుతోంది.
ఆ ఇద్దరు డీటీసీల పేర్లతో హల్చల్!
గత ప్రభుత్వ హయాంలో రవాణా శాఖలోని ఇద్దరు కీలక డీటీసీల (DTC) పేర్లను వాడుకుంటూ ఈ ఎంవీఐ ఆడిన ఆటలు అన్నీ ఇన్నీ కావట,వారిద్దరికీ తాను అత్యంత సన్నిహితుడినని చెప్పుకుంటూ, శాఖలోని కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరినీ భయపెట్టి వసూళ్లకు పాల్...
