Sarkar Live

సివిల్ సప్లైలో ‘బంధు’ ప్రీతి: అర్హత లేకున్నా ఉద్యోగం.. ‘ఎర్రమంజిల్’ అండతోనే ఆ గత్తర!

Civil Supplies Nepotism Telangana | ​అర్హత ప్రాతిపదికన దక్కాల్సిన ఉద్యోగం అది.. కానీ అక్కడ ‘అర్హత’ కంటే ‘అండదండలకే’ పీట వేశారు. నిబంధనల ప్రకారం ఆ సీటులో కూర్చోవడానికి సదరు ఉద్యోగికి ఏమాత్రం అర్హత లేకపోయినా, చక్రం తిప్పిన ఓ

Civil Supplies Nepotism Telangana

Civil Supplies Nepotism Telangana | ​అర్హత ప్రాతిపదికన దక్కాల్సిన ఉద్యోగం అది.. కానీ అక్కడ ‘అర్హత’ కంటే ‘అండదండలకే’ పీట వేశారు. నిబంధనల ప్రకారం ఆ సీటులో కూర్చోవడానికి సదరు ఉద్యోగికి ఏమాత్రం అర్హత లేకపోయినా, చక్రం తిప్పిన ఓ ‘పెద్ద సారు’ పుణ్యమా అని దర్జాగా గద్దెనెక్కి కూర్చున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం సివిల్ సప్లై శాఖలో హాట్ టాపిక్‌గా మారింది.

​ఎర్రమంజిల్ నుంచే అసలు కథ!

​ఈ వ్యవహారానికి ప్రధాన కేంద్రం ఎర్రమంజిల్‌లోని సివిల్ సప్లై ప్రధాన కార్యాలయం. అక్కడ కీలక బాధ్యతల్లో ఉన్న ఒక ఉన్నతాధికారికి సదరు ఉద్యోగికి అత్యంత సన్నిహిత బంధువు కావడమే ఇందుకు కారణం. ఆ బంధుత్వమే ఇప్పుడు నిబంధనలకు తూట్లు పొడిచేలా చేసింది. తను కోరుకున్న చోట, కోరుకున్న రీతిలో చక్రం తిప్పేందుకు ఎర్రమంజిల్ నుంచే పావులు కదిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

​నోరు మెదపని జిల్లా మేనేజర్ (DM)

​నిజానికి అర్హత లేని వ్యక్తి కీలక స్థానంలో ఉంటే ప్రశ్నించాల్సిన జిల్లా మేనేజర్ (DM) మాత్రం ‘గమ్మున’ ఉండిపోవడం చర్చనీయాంశమైంది. సదరు ఉద్యోగికి అర్హత లేదని తెలిసినప్పటికీ.. పైన ఉన్నది ‘పెద్ద సారు’ బంధువు కావడంతో, ఎక్కడ తన సీటుకు ముప్పు వస్తుందోనని జిల్లా అధికారి మౌనం వహిస్తున్నట్లు సమాచారం.
​”నిబంధనలు సామాన్యులకేనా? ఉన్నతాధికారుల బంధువులైతే అర్హతలతో పనిలేదా?” అని తోటి ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.

​ సదరు ఉద్యోగికి ఆ బాధ్యతలు చేపట్టే కనీస అర్హత లేదని విమర్శలు వస్తున్నాయి.ఎర్రమంజిల్ హెడ్ ఆఫీసులోని అధికారి అండతోనే ఈ నియామకం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం​సదరు ఉద్యోగి ఉన్నతాధికారి బంధువు కావడంతోనే జిల్లా మేనేజర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
​ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, పైరవీలతో సాగుతున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందిస్తారా? లేక ఈ ‘బంధు’ చక్రం ఇలాగే కొనసాగుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?