జలమండలి జీఎం ఇంట్లో ACB మెరుపు దాడులు: బీరువాల్లో నోట్ల కట్టలు.. లెక్కించడానికి కౌంటింగ్ మెషీన్లు!
తెలంగాణలో అవినీతి తిమింగలాల వేటలో యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు మరోసారి విరుచుకుపడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి (HMWSSB) జనరల్ మేనేజర్ (GM)ను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచే విస్తృత సోదాలు చేపట్టారు. ఈ దాడులు ప్రస్తుతం నగరంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.
8 ప్రాంతాల్లో ఏకకాలంలో ACB తనిఖీలు
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ప్రాజెక్ట్ డివిజన్-8 రెడ్ హిల్స్‌లో జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్)గా పనిచేస్తున్న ఎస్. అనంత లక్ష్మి కుమార్ తన పదవిని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు.
మంగళవారం (మే 19) తెల్లవారుజామున 6 గంటలకే రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు, ఎవరూ బయటికి వెళ్లకుండా, లోపలికి రాకుండా ముందస్తు చర్యలు తీసు...

