Land Scam | అక్రమాల ‘డీఐ’.. అవినీతి ‘పానీయం’!
అటెండర్ టు డీఐ ప్రమోషన్ విద్యా అర్హతలపై నీలినీడలు?
ఎల్కతుర్తిలో సర్వే నెంబర్ మార్పిడికి భారీగా ముడుపులు!
ముచర్ల చెరువులోని పట్టా భూమి వ్యవహారంలో ‘లకారాలు’ చేతులు మారినట్లు గుసగుసలుసదరు అధికారికి కాదేదీ అవినీతికి అనర్హం. చిన్న ఫైలు కదలాలన్నా, పెద్ద భూమి వ్యవహారం చక్కబడాలన్నా అక్కడ ‘ముడుపుల పానీయం’ తాగాల్సిందేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటెండర్ స్థాయి నుంచి డీఐ (డివిజనల్ ఇన్‌స్పెక్టర్/భూ రికార్డుల తనిఖీ అధికారి) స్థాయికి ఎదిగిన సదరు అధికారి ప్రమోషన్ విద్యా అర్హతలపైనే ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లంచాలనే పానీ(నీళ్ల)లా మింగేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు రెవెన్యూ (Revenue Department), సర్వే శాఖల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఎల్కతుర్తి (Elkathurthi), ముచర్ల (Mucharla)పరిధిలో జరిగిన కొన్ని భూ భాగోతాలు (Land Scam) ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
అర్హ...
