పీసీసీ చీఫ్ టార్గెట్‌గా తెరవెనుక రాజకీయం – Telangana Congress
మహేష్ కుమార్ గౌడ్‌పై ముప్పేట దాడి.. అసలు కథేంటి?
తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) లో అంతర్గత పరిణామాలు ఒక్కసారిగా హీటెక్కాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వం, పార్టీ సమన్వయకర్తగా సాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ దుమారం రేగుతోంది. ఒక వైపు నామినేటెడ్ పదవుల భర్తీ, వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపికపై కసరత్తు జరుగుతుండగానే, ఆయనను టార్గెట్ చేస్తూ వస్తున్న కొన్ని మీడియా కథనాలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Telangana Congress : మీడియాలో ముప్పేట దాడి.. అసలు కథేంటి?
ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఒక ప్రముఖ తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్‌లో గత రెండు రోజులుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వైఫల్యాలపై వరుస కథనాలు రావడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. ఆయనను "సమర్థవంతమైన నాయకుడు కాదు" అనే కోణంలో ప్రచారం చేయడం వెనుక పార్ట...

