సామాన్యుడిపై ఇంధన భారం: లీటర్ పెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 పెంపు.. – Fuel Price Hike
10 రోజుల్లో నాలుగోసారి!
Fuel Price Hike దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలకు అదనపు భారం తప్పడం లేదు. ప్రభుత్వ చమురు రంగ సంస్థలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.2.61, లీటర్ డీజిల్‌పై రూ.2.71 చొప్పున పెంపు అమల్లోకి వచ్చింది. ఈ కొత్త ధరలు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఇది పది రోజుల్లోనే జరిగిన నాలుగో ధరల పెంపు కావడం గమనార్హం. వరుసగా పెరుగుతున్న ధరలతో ఇప్పటికే సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, తాజా పెంపు మరింత ఆర్థిక ఒత్తిడిని మోపనుంది.
10 రోజుల్లోనే లీటరుకు రూ.8 భారం!
గత పది రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు కలిపి లీటరుకు దాదాపు రూ.8 వరకు పెరిగినట్లు తెలుస్తోంది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12కు చేరుకోగా, డీజిల్ ధర రూ.95.20కు పెరిగింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్...

